మరో కమర్షియల్ మూవీతో రవితేజ

మరో కమర్షియల్ మూవీతో రవితేజ

మరో కమర్షియల్ మూవీతో రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) మరో కమర్షియల్ మూవీ కి పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.ఈ సినిమాతో జీవీఆర్ వాసు(GVR Vasu) అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకీ పరిచయం చేయబోతున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertinements) బ్యానర్ పై నిర్మాత నాగవంశీ(NagaVamshi) ఈ మూవీ తెరకెక్కిస్తారని సమాచారం.ఈ ప్రాజెక్టు కి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని టాక్ వినిపిస్తోంది.ఈ ఏడాది డిసెంబర్ లో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

గత ఏడాది ఏకంగా మూడు సినిమాలని సెట్స్ పైకి తీసుకొచ్చిన రవితేజ ఈ ఏడాది కూడా మరో మూడు సినిమాలని లైన్లో పెట్టేసాడు. రీసెంట్ గా షూటింగ్ పూర్తీ చేసుకున్న టైగర్ నాగేశ్వర్ దసరా కి పాన్ ఇండియా లెవెల్లో రీలిజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి అభిమానుల్లో హైప్ ని క్రీయేట్ చేశారు. 

 థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈగల్: 

పలు హిట్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ ఘట్టమనేని(Kartik Gattamaneni) దర్శకత్వంలో ఈగల్(Eagle) అనే మూవీ చేస్తున్నట్లు రీసెంట్ గా రవితేజ ప్రకటించిన విషయం తెలిసిందే.డిఫరెంట్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ క్యూరియాసిటీని పెంచేశారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2024 సంక్రాంతిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. 

యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాబోతున్న ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran), కావ్య థాపర్(Kavya thapar), శ్రీనివాస్ అవసరాల(Srinivas Avasarala), నవదీప్(Navadeep) మరియు మధుబాల(Madhubala) కూడా నటిస్తున్నారు.