రవితేజ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్కు రెడీ

రవితేజ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్కు రెడీ

భారీ అంచనాల నడుమ మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది. శుక్రవారం (ఏప్రిల్ 7) సినిమా విడుదల కానుంది. దీంతో రవితేజ ఫ్యా్న్స్ సందడి చేస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసి మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన రవితేజ.. అదే జోరును ఈ సినిమాలో కూడా కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

యాక్షణ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రివితేజ పవర్ ఫుల్ లాయర్ గానే కాకుండా స్టైలిష్ గెటప్ లోనూ కనిపిస్తాడు. ట్రైలర్, టీజర్లలో వచ్చిని సీన్స్, డైలాగ్స్ వింటుంటే.. రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ కాయం అనిపిస్తోంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇప్పటికే దుమ్ము లేపాయి.

ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్నారు. భీమ్స్‌‌‌‌ సిసిరోలియో, హర్షవర్దన్ రామేశ్వర్‌‌‌‌ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌లో కనిపిస్తాడని అర్థమవుతోంది. 

అనూ ఎమ్మాన్యుయేల్‌‌‌‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌‌‌‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, సుశాంత్‌‌‌‌ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. రావు రమేశ్‌‌‌‌, మురళీ శర్మ, సంపత్‌‌‌‌ రాజ్‌‌‌‌, నితిన్‌‌‌‌ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.