రవితేజ - గోపిచంద్ మూవీ..చుండూరు మారణహోమమా?

రవితేజ - గోపిచంద్ మూవీ..చుండూరు మారణహోమమా?

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)  వరుస సినిమాలతో ఫామ్ లో ఉన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో మరో మూవీ చేయడానికి రెడీ అయిన విషయం తెలిసేందే. వీరి కాంబో అంటే ఫ్యాన్స్ కు కిక్కేంచే వార్తా కావడంతో ఏ ఈమూవీ పై ఆసక్తి కలిగిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం  వీరి నుంచి రాబోతున్న స్టోరీ లైన్ రియల్ ఇన్సిడెంట్ తో బేస్ చేసుకొని ఉంటుందని వినిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన RT 4 GM పోస్టర్ లో కనిపించిన చుండూరు గ్రామం అని ఉండటమే..ఈ స్టోరీ పై ఇంట్రెస్ట్ పెంచుతోంది. 

చుండూరు అంటే ఏపీ లోని ఒక గ్రామం. ఈ గ్రామంలో జరిగిన మారణహోమం ఇప్పటికీ మరిచిపోలేని అంశం. 1991 సం,లో అగ్రవర్ణాల కులాలకు చెందిన కొంత మంది, ఓ వర్గంపై  దాడి చేసి కర్రలతో, కత్తులతో వెంటాడి చంపినా తీరు చాలా అమానుషం. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. ఇక ఆ వర్గానికి చెందిన వారిని  కర్కశంగా నరికి ముక్కలు చేసి తుంగభద్ర నదిలో పడేశారు. 

ఈ మారణహోమం జరిగి ఇన్నాళ్లయినా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఏపీ హైకోర్టు లో విచారణ జరిపిన, ఆధారాలు లేవని కేసు కొట్టి వేసి, నిందితులని నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసేందే.. RT 4 GM  పోస్టర్ లో చూపించిన.. చుండూరు గ్రామం చూడగానే అందరికి గుర్తుకొచ్చే ప్రధాన అంశం ఇది ఒక్క మారణహోమమే. ఈ మూవీ స్టోరీ లైన్ గురుంచి ఇంకా ప్రకటన రాకున్న..సోషల్ మీడియాలో మాత్రం ఓ వర్గంపై  దాడి అంశం తెర మీదికి వచ్చింది. 

ఇలాంటి రియలిస్టిక్ ఘటనతో మూవీ చేయడం సాహసమే అంటున్నారు క్రిటిక్స్..ఇక తెరకెక్కించే విధానంలో మేకర్స్  ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.