
వరుస విజయాలతో సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ.. త్వరలో ‘రావణాసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 28న సాయంత్రం 04.05 నిముషాలకు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు శనివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు రవితేజ. సుశాంత్ ఫస్ట్ టైమ్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా కథను అందించాడు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.