కపిల్ దేవ్ రికార్డ్ ని బ్రేక్ చేసిన అశ్విన్

కపిల్ దేవ్ రికార్డ్ ని బ్రేక్ చేసిన అశ్విన్

టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చ‌రిత్ర సృష్టించాడు. టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు.కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు.టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు.శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసలంకను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ టెస్టుల్లో 435వ వికెట్‌ సాధించాడు. దీంతో అశ్విన్ టీమిండియా దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌(434 వికెట్లు) రికార్డును బద్దలుకొట్టాడు.ఇక తొలి స్థానంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ కుంబ్లే 619 వికెట్లతో ఉండగా.. టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ 417 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్‌ 9వ స్థానానికి చేరుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం

తిప్పేసిన జడేజా.. శ్రీలంక 174 ఆలౌట్