200 వికెట్ల క్లబ్ లో జడేజా..కపిల్ దేవ్ తర్వాత తొలి ప్లేయర్ గా ఘనత 

200 వికెట్ల క్లబ్ లో జడేజా..కపిల్ దేవ్ తర్వాత తొలి ప్లేయర్ గా ఘనత 

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన జాబితాలోకి చేరిపోయాడు. 35 వ ఓవర్లో షామీమ్ హుస్సేన్ వికెట్ తీసిన ఈ ఆల్ రౌండర్..వన్డేల్లో 200 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఈ క్రమంలో దిగ్గజ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. వన్డేల్లో 200 వికెట్లు తీసిన జడ్డూ.. 2000 పరుగులు కూడా చేసాడు. దీంతో కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఆల్ రౌండర్ గా రికార్డ్ సృష్టించాడు. 

Also Read :- భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేది అప్పుడే: అనురాగ్ ఠాకూర్

   
1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ 1978లో తన 166 ODI ఇన్నింగ్స్‌లలో డబుల్ (2000 పరుగులు మరియు 200 వికెట్లు) సాధించిన మొదటి భారతీయ ఆల్ రౌండర్ గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45 ఓవర్లలో 7 వికెట్లను 223 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ 80 పరుగులతో బంగ్లా టాప్ స్కోరర్ గా నిలిచాడు. శార్దూలు ఠాకూర్ కి 3 వికెట్లు దక్కాయి.      .