జడేజా స్పిన్ మ్యాజిక్‌‌‌‌..సౌతాఫ్రికా7 వికెట్లకు 93రన్స్..తొలిటెస్టు మన చేతుల్లోకి

జడేజా స్పిన్ మ్యాజిక్‌‌‌‌..సౌతాఫ్రికా7 వికెట్లకు 93రన్స్..తొలిటెస్టు మన చేతుల్లోకి
  • సౌతాఫ్రికా 93/7 
  • జడేజా స్పిన్ మ్యాజిక్‌‌‌‌..రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో సౌతాఫ్రికా 93/7
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో  ఇండియా 189 ఆలౌట్‌‌‌‌
  • ఆతిథ్య జట్టు చేతుల్లోకి తొలి టెస్టు

కోల్‌‌‌‌కతా: అనూహ్యంగా టర్న్ అవుతున్న ఈడెన్ గార్డెన్స్ పిచ్‌‌‌‌పై రవీంద్ర జడేజా (4/29)తన స్పిన్ మాయాజాలాన్ని చూపెట్టిన వేళ సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. ఆసక్తికర మలుపులు తిరుగుతూ.. ఒకే రోజు 15 వికెట్లు కూలిన పోరులో సౌతాఫ్రికా బ్యాటర్లకు పీడకల మిగిల్చిన జడేజా ఆతిథ్య జట్టును విజయం ముంగిట నిలిపాడు.  

అతని ధాటికి శనివారం, రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 93/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆ టీమ్  63 రన్స్  ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ టెంబా బవూమ (29 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చేతిలో మరో మూడు వికెట్లు ఉండటంతో ఆదివారమే మ్యాచ్ ముగియడం దాదాపు ఖాయమైంది. 

అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 37/1తో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 189 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో 30 రన్స్ ఆధిక్యమే దక్కించకుంది. కేఎల్ రాహుల్ (39), వాషింగ్టన్ సుందర్ (29), రిషబ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) పోరాడారు. కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ (4) మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ అవ్వగా.. సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ (4/30), పేసర్ మార్కో యాన్సెన్ (3/35) దెబ్బకొట్టారు. 

30 రన్స్ ఆధిక్యంతో సరి

తొలి రోజు పేసర్లకు అనుకూలించిన ఈడెన్ వికెట్‌‌‌‌ రెండో రోజు అనూహ్యంగా మారింది. ఒక్కసారిగా స్పిన్‌‌‌‌కు అనుకూలంగా మారి.. బ్యాటర్లకు సవాల్ విసిరింది. ఉదయం రెండో గంట నుంచే బాల్ పడిన వెంటనే  దుమ్మురేవడం చూస్తే నాలుగో రోజు వికెట్‌‌‌‌ను తలపించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్లు  రాహుల్‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌ తొలి గంట ఓపిగ్గా క్రీజులో నిలిచి మంచి స్కోరుపై ఆశలు రేపారు. 

కానీ, డ్రింక్స్‌‌‌‌ తర్వాత సఫారీ స్పిన్నర్లు హార్మర్‌‌‌‌‌‌‌‌, కేశవ్‌‌‌‌ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. సుందర్‌‌‌‌‌‌‌‌ను ఔట్ చేసిన హార్మర్‌‌‌‌‌‌‌‌.. రెండో వికెట్‌‌‌‌కు 57 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు.   కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ (4) స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌‌‌‌గా వెనుదిరిగాడు. అతను తిరిగి బ్యాటింగ్‌‌‌‌కు రాలేదు.  కాసేపటికే కేశవ్ బౌలింగ్‌‌‌‌లో స్వీప్ షాట్‌‌‌‌కు ప్రయత్నించిన రాహుల్.. స్లిప్‌‌‌‌లో క్యాచ్ ఇచ్చాడు. 

 రిషబ్ పంత్ ఉన్నంతసేపు తనదైన స్టయిల్లో ఎటాక్‌‌‌‌ చేశాడు. కేశవ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు సిక్సర్లు, ఓ రివర్స్ స్వీప్ షాట్‌‌‌‌తో అలరించిన అతను  లంచ్‌‌‌‌కు ముందు బాష్ వేసిన పదునైన బౌన్సర్‌‌‌‌కు  ఔటయ్యాడు. ఇండియా 138/4తో లంచ్‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత  జడేజా కాసేపు పోరాడినా.. హార్మర్‌‌‌‌‌‌‌‌, యాన్సెన్‌‌‌‌ ఆతిథ్య లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టారు. జురెల్‌‌‌‌ (14)ను రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో వెనక్కుపంపిన హార్మర్.. జడ్డూను ఎల్బీ చేశాడు. యాన్సెన్‌‌‌‌ దెబ్బకు కుల్దీప్ (1), సిరాజ్ (1) పెవిలియన్ చేరారు. అక్షర్‌‌‌‌‌‌‌‌ (16)  లాస్ట్ వికెట్‌‌‌‌గా ఔటయ్యాడు. 

ఇండియా స్పిన్ వల

30 రన్స్‌‌‌‌ లోటుతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను కుల్దీప్ యాదవ్ (2/12) టీ విరామానికి ముందే దెబ్బ తీశాడు. ఓపెనర్ ర్యాన్‌‌‌‌ రికెల్టన్ (11)ను గూగ్లీతో బోల్తా కొట్టించాడు. కానీ అసలు మ్యాజిక్ టీ విరామం తర్వాత మొదలైంది. కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ గాయంతో మైదానంలో లేనివేళ, స్టాండిన్ కెప్టెన్  పంత్ బంతిని రవీంద్ర జడేజాకు అందించాడు. క్లబ్ హౌస్ ఎండ్ నుంచి ఏకధాటిగా 13 ఓవర్ల అద్భుతమైన స్పెల్ వేసిన జడేజా సఫారీ బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌ను వణికించాడు. 

పిచ్ నుంచి లభిస్తున్న అనూహ్యమైన టర్న్, బౌన్స్‌‌‌‌ను వాడుకుంటూ జడేజా తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటినీ ప్రయోగించాడు.  జడేజా బాల్‌‌‌‌ స్వీప్ చేయబోయిన మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (4)  టాప్ ఎడ్జ్ ఇచ్చి షార్ట్ లెగ్‌‌‌‌లో ధ్రువ్ జురెల్‌‌‌‌కు చిక్కాడు.  ఆ వెంటనే  ఒకే ఓవర్లో  వియాన్ ముల్డర్ (11), టోనీ డి జారి (2)ని జడ్డూ పెవిలియన్ చేర్చాడు.  

ఓ ఎండ్‌‌‌‌లో బవూమ క్రీజులో పాతుకుపోగా.. ట్రిస్టన్ స్టబ్స్ (5)  జడేజా  లైన్‌‌‌‌ను  మిస్ అయి బౌల్డ్ అయ్యాడు. జడ్డూకు తోడైన  అక్షర్ పటేల్ (1/30) కైల్ వెరెన్‌‌‌‌ (9)ను బౌల్డ్ చేయగా.. యానెన్స్‌‌‌‌ (13)ను పెవిలియన్ చేర్చిన కుల్దీప్‌‌‌‌ రెండో రోజుకు అద్భుత ఫినిషింగ్ ఇచ్చాడు. 

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌:   159 ఆలౌట్‌‌‌‌;  ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 62.2 ఓవర్లలో 189 ఆలౌట్ (రాహుల్‌‌‌‌ 39, సుందర్‌‌‌‌ 29, హార్మర్ 4/30, యాన్సెన్‌‌‌‌ 3/35). సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 35 ఓవర్లలో 93/7 (బవూమ  29 బ్యాటింగ్‌‌‌‌, జడేజా 4/29, కుల్దీప్ 2/12).

రవీంద్ర జడేజా (4/27) స్పిన్​తో మాయ చేశాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. జడేజా ధాటికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌‌లో 93/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆ టీమ్ 63 రన్స్ ఆధిక్యంలో ఉంది.

4  టెస్టుల్లో 4 వేల రన్స్, 300 వికెట్లు తీసిన నాలుగో  ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా  జడేజా  .. ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వెటోరీ సరసన చేరాడు. 
4000 కేఎల్ రాహుల్ టెస్టుల్లో 4 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు.

గిల్‌‌ బరిలోకి దిగేనా!

మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయిన ఇండియా కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ మూడో రోజు బరిలోకి దిగడం అనుమానంగా మారింది. నొప్పి తగ్గకపోవడంతో అతడిని  కోల్‌‌కతాలోని హాస్పిటల్‌‌కు తీసుకెళ్లి స్కానింగ్‌‌, ఇతర టెస్టులు  నిర్వహించారు.  ఇండియా టీమ్ డాక్టర్‌‌తో కలిసి గిల్ బయలుదేరేటప్పుడు అతని మెడకు సెర్వైకల్ బ్రేస్ ఉన్నట్టు తెలిసింది. 

ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ,  బీసీసీఐ  మెడికల్ టీమ్ రాత్రి వరకూ స్కాన్ రిపోర్ట్స్ కోసం వేచి చూసింది. దాంతో ఆదివారం తను ఆడే విషయంపై టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.  సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల గిల్ మెడ పట్టేసి ఉండవచ్చని అసిస్టెంట్ కోచ్ మోర్కెల్ చెప్పాడు.