
ఢిల్లీ : టీవీ9 యాజమాన్యంతో ఉన్న వివాదంలో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్. సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలోనే ఆయన హైదరాబాద్ హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు రవిప్రకాష్. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు తెలంగాణ పోలీసులు.