రవితేజతో అనుదీప్.. జాతిరత్నాలు లోడింగ్

రవితేజతో అనుదీప్.. జాతిరత్నాలు లోడింగ్

మాస్ మాహారాజా రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా కాలం తరువాత ఫ్యాన్స్ ఎలాంటి అప్డేట్ కోరుకుంటున్నారో అలాంటి అప్డేట్ ఇచ్చాడు రవితేజ. ఈ న్యూస్ విన్నాక ఆయన ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే.. రవితేజ తన తరువాతి సినిమాను జాతరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో చేయడానికి ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి రవితేజ బాడీ లాంగ్వేజ్ కు అనుదీప్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే ఈ కాంబోలో మూవీ అనగానే రవితేజ ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రిన్స్ మూవీ ఫ్లాప్ తరువాత ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేసాడట అనుదీప్. ఆ కథకి రవితేజ ఐతేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. వెంటనే కథ కూడా వినిపించాడట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట మాస్ మహారాజ. వెంకీ, దుబాయ్ శీను తరువాత ఇప్పటివరకు అలాంటి కెమెడీ ఎంటర్టైనర్ చేయని రవితేజ.. ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడట.

ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ఇక ప్రస్తుతం రవితేజ.. డైరెక్టర్ మహేష్ తో టైగర్ నాగేశ్వర రావు అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.