Raviteja Eagle Release: ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి..ఫిలిం చాంబర్‌కు నిర్మాతల లేఖ

Raviteja Eagle Release: ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి..ఫిలిం చాంబర్‌కు నిర్మాతల లేఖ

సంక్రాంతి బరిలో ఉంటుందనుకున్న రవితేజ ఈగల్‌ మూవీ అనుహ్యంగా రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా విడుదలపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌  సమావేశమయ్యి..సోలో రిలీజ్ డేట్ వచ్చేలా చూస్తామని సదరు ప్రొడ్యూసర్ కి నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేశారు. ప్రస్తుతం ఈగల్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై వార్తలు వేడెక్కుతున్నాయి.

లేటెస్ట్గా తమకు ఇచ్చిన ‘సోలో రిలీజ్ డేట్‌’ మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఛాంబర్‌ను కోరింది. అందుకు పెద్దలందరూ సహకరించాలని లేఖలో తెలిపింది.  అంతేకాకుండా, ముందుగా ఛాంబర్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నాం. ఛాంబర్ నుంచి హామీ తీసుకోవడం ద్వారా మాకు సోలోగా డేట్ దొరుకుతుందని భావించాం.

కానీ, దురదృష్టవశాత్తు మేము అనుకుంటున్న ప్రతి డేట్‌కు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని పెద్దలు గమనించాలని, మాకు సోలో రిలీజ్ డేట్ కేటాయించేలా చూడాలని అభ్యర్తిస్తున్నాం' అంటూ  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదట తెలుగు నిర్మాతల మండలి అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టిల్లు స్క్వేర్ వాయిదాకి ఒప్పించామని తెలిపారు. కానీ, ఇపుడు ఫిబ్రవరి 8న యాత్ర 2, ఊరు పేరు భైరవకోన  ఫిబ్రవరి9న, రజినీకాంత్ లాల్ సలాం ఫిబ్రవరి 9న సినిమాల రిలీజ్ డేట్స్ ఉన్నాయనే మర్చిపోవడంతో..ఇపుడు పలు అనుమానాలకు దారి తీసింది. ఏదేమైనా ఈగల్ ప్రొడ్యూసర్స్ రేకెత్తించిన అంశాలలో న్యాయం ఉందంటూ పలువురు సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడీ ఈగల్ ప్రొడ్యూసర్స్ రాసిన లెటర్ కి ఫిలిం ఛాంబర్ ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇంకో కొత్త డేట్ కి మార్చబోతున్నారా? అంటే ప్రస్తుతం మరో డేట్ కి వెళ్లే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. పోనీ మిగిలినవాళ్లను ఒప్పిస్తారా అంటే అదంత సులభమైన పనికాదు.  రోజు రోజుకి మారుతున్న సినిమాల రిలీజ్ డేట్స్ గొడవలు ఎంతవరకు వెళ్తాయో అని ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏమవుతుందో చూడాలి. 

ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే..కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని  టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు.  ఇందులో రవితేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించగా. న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషించాడు. ముందుగా ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్.