మాస్ మహారాజ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర ఓటీటీ(OTT) రిలీజ్ కి సిద్దమైంది. సుధీర్ వర్మ(Sudheer varama) దర్శకతం వహించిన ఈ మూవీ.. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో ఇంతవరకు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించాడు రవితేజ. అను ఇమ్మాన్యేయేల్, ఫరియా అబ్దుల్లా వంటి ఐదుగురు యంగ్ హీరోయిన్స్ ఈ సినిమాలో నటించారు.
అంతేకాకుండా.. ధమాఖా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత రవితేజ నుండి వస్తున్న మూవీ కావడం, టీజర్, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండటంతో.. ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా.. రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో OTTలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మే 5న ఈ సినిమా స్ట్రీమింగ్ ఉండనుదని తెలుస్తోంది. మరి థియేటర్లో ఫ్లాప్ గా నిలిచిన ఈ మూవీ.. OTTలో ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలంటే మే 5వ తేదీ వరకు ఆగాల్సిందే.