Tiger Nageswara Rao X Review: టైగర్‌ నాగేశ్వరరావు గా రవితేజ విశ్వరూపం.. మరి రిజల్ట్ ఏంటి?

Tiger Nageswara Rao X Review: టైగర్‌ నాగేశ్వరరావు గా రవితేజ విశ్వరూపం.. మరి రిజల్ట్ ఏంటి?

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వరరావు(Tiger Nageswara rao). స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వంశీ(Vamsee) తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్(Abhishek pictures) బ్యానర్ పై అభిషేక్‌ అగర్వాల్‌(Abhishek agarwal) నిర్మించిన ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ నూపుర్ సనన్(Nupur sanon), గాయత్రి భరద్వాజ్(Gayatri Bharadwaj) హీరోయిన్స్ గా నటించారు. సాంగ్స్ అండ్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు, రవితేజ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరి సినిమా ఎలా ఉంది? టైగర్‌ నాగేశ్వరరావుగా రవితేజ ఏమేరకు ఆకట్టుకున్నాడు? సినిమాకు ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

రవితేజ హీరోగా వచ్చిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమాకు ఎక్స్(ట్విటర్‌)లో మంచి స్పందన వస్తోంది. డార్క్‌ క్యారెక్టర్‌లో రవితేజ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌, ట్రైన్‌ సీక్వెన్స్‌ చాలా బాగా డిజైన్ చేశారట. ఖచ్చితంగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా రవితేజ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. అయితే.. ఈ సినిమాకు రన్‌ టైమ్‌ ఇబ్బందికరంగా మారిందని కొంతమంది అంటున్నారు. లవ్‌ట్రాక్‌, సాంగ్స్ కూడా కథను డిస్టర్బ్ చేసేలా ఉన్నాయంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కావాలని కథలో జోడించినట్టుగా ఉందని, అవి యాడ్ చేయకుంటే సినిమా ఇంకా చాలా బాగా ఉండేదని అంటున్నారు.  

ఇక మొత్తంగా ఫస్టాఫ్‌ లో మొదటి అరగంట తరువాత సినిమా గాడితప్పిందని, డైరెక్టర్ తీసుకున్న కథ బాగున్నా, కథనం తేలిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ అందించిన సాంగ్స్ అంతగా లేనప్పటికీ, బీజీఎమ్ మాత్రం డీసెంట్ గా ఉందంటున్నారు. కొన్ని సన్నీవేశాలలో సినిమాకు మ్యూజిక్ మంచి హైప్ ఇచ్చిందని అంటున్నారు.