సైలెంట్గా OTTకి విచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

సైలెంట్గా OTTకి విచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao). కొత్త దర్శకుడు వంశీ(Vamssi) తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు..  ఆడియన్స్ నుండి మాత్రం నెగిటీవ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. ఆడియన్స్ కూడా థియేటర్ లో ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. 

ఇదిలా ఉంటే.. థియేట్రికల్ రన్ ముగుంచుకున్న ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. నవంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. నిజానికి ఆడియన్స్ కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం  చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ దక్కనుందో చూడాలి. 

ఇక రవితేజ తరువాతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఈగల్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.