సిబ్బంది లేకుండా మొక్కలెట్ల పెంచుతరు?

సిబ్బంది లేకుండా మొక్కలెట్ల పెంచుతరు?

హైదరాబాద్‌‌, వెలుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం బతుకకుంటే పంచాయతీ సెక్రటరీ, వార్డు స్పెషల్‌‌ ఆఫీసర్లను తొలగిస్తామని, సర్పంచ్, కౌన్సిలర్ల పదవి పోతదని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి ఇది నిదర్శనమన్నారు. సిబ్బందిని నియమించకుండా ఈ నిబంధన పెట్టడం సరికాదన్నారు. శనివారం ఎన్టీఆర్‌‌ ట్రస్ట్‌‌ భవన్‌‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.181 పేజీలున్న మున్సిపల్‌‌ చట్టంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగకుండానే ఆమోదించడం సరికాదన్నారు.