ఇకనుంచి UPI ద్వారా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు..ఎలా అంటే..

ఇకనుంచి UPI  ద్వారా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు..ఎలా అంటే..

UPI New Feature: సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేయాలంటే..బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీఎంకు వెళ్లి డెబిట్ కార్డు ద్వారా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. ఇది ఇప్పటివరకున్న క్యాష్ డిపాజిట్ సౌకర్యం. ఇకనుంచి UPI  ద్వార కూడా క్యాష్ను డిపాజిట్ చేయొచ్చు. 24 గంటలు ఎప్పుడైనా క్యాష్ను డిపాజిట్ చేసుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కొత్తగా UPI  ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా UPI ఫీచర్ ను ఉపయోగించి డబ్బును డిపాజిట్ చేయొచ్చు. ఇది ఏటీఎం ద్వారా క్యాష్ డిపాజిట్ లను మరింత సులభతరం, సౌకర్యవంతంగా అందించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు ఆర్బీఐ చెబుతోంది. 

యూపీఐ కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ 

యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్, విత్ డ్రా లు ఒకేలా ఉంటాయి. ఆయా బ్యాంకులు తమ ఏటీఎం ద్వారా కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ ఎలా చేయాలి అనేదాని గురించి మీకు మరింత సమాచారాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతతం నగదు డిపాజిట్  మెషీన్లలో నగదు డిపాజిట్ చేయడానికి డెబిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. 

మొత్తం మీద ఏటీఎంలలో యూపీఐ ఆధారిత క్యాష్ డిపాజిట్లను ప్రవేశపెట్టడం అనేది ప్రస్తుతం భారత దేశంలో బ్యాంకింగ్ సేవలను డిజిటలైజ్ చేయడానికి, ఆధునీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు. ఇది కస్టమర్లకు సేవలను సులభతరం చేస్తుంది.