టన్నులు టన్నులు బంగారం కొంటున్న RBI.. మరి మీరు కొంటున్నారా లేదా..!

టన్నులు టన్నులు బంగారం కొంటున్న RBI.. మరి మీరు కొంటున్నారా లేదా..!

RBI.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా.. బంగారం తెగ కొంటుంది.. టన్నులు టన్నులు కొనుగోలు చేస్తుంది. 2024 జనవరి నెలలో 7 టన్నుల బంగారం కొనుగోలు చేస్తే.. ఫిబ్రవరి నెలలో ఆరు టన్నులు కొనుగోలు చేసింది. ఈ రెండు నెలల్లోనే ఏకంగా 13 టన్నుల బంగారం నిల్వలను పెంచుకున్నది. ఈ కొనుగోళ్లతో.. రిజర్వ్ బ్యాంక్ దగ్గర బంగారం నిల్వలు 817 టన్నులకు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఇన్ని టన్నుల బంగారం ఎందుకు కొనుగోలు చేస్తుంది అనే సందేహం మీకు రావొచ్చు.. అక్కడికే వస్తున్నాం..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉన్నది. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు మన రూపాయితో డాలర్ విలువ రోజురోజుకు పడిపోతున్నది. భారతదేశంలో ధరల పెరుగుదల కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనంతోపాటు.. ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదల.. వడ్డీ రేట్ల పెరుగుదల ఇలా అనిస్థితి పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సైతం విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.. తగ్గిపోతున్నాయి. దీంతో విదేశాల నుంచి కొనుగోలు చేసే ముడి చమురు, ఇతర దిగుమతులకు రూపాయిల్లో చెల్లించటం ద్వారా భారీగా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు ద్వారా.. రిజర్వ్ బ్యాంక్ తన నిల్వలను పెంచుకోవాలని భావిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం మారకం అనేది ఎంతో ఈజీగా ఉంటుంది. దీనికితోడు రోజురోజుకు బంగారం ధర పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. 2024 జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లోనే.. మార్కెట్ నుంచి 13 టన్నుల బంగారం కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 

ఒక్క మన ఆర్బీఐనే కాదు.. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు సైతం ఈ ఏడాది భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేశాయి. చైనా బ్యాంకులు అయితే ఒక్క ఫిబ్రవరి నెలలో ఏకంగా 19 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఆయా దేశాల్లో విదేశీ నగదు నిల్వలు తగ్గిపోతుండటంతో.. దాన్ని భర్తీ చేసేందుకు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. 

బ్యాంకులు ఇలా బంగారం కొంటున్నాయి.. మరి సామాన్యులు కొంటున్నారో లేదో.. అసలు బంగారం కొనటానికి జనం దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కదా...