మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ

మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ

ముంబయి: బ్యాంక్ వద్ద సరిపడా మూలధనం లేకున్నా కార్యకలాపాలు కొనసాగిస్తున్న శివాజీరావు భోసలే సహకార బ్యాంక్ లైసెన్సు ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. మహారాష్ట్రలోని పుణే  కేంద్రంగా ఈ బ్యాంకు  బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నిన్న అంటే మే 31 నుంచే బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం అమలులోకి వచ్చిందని ఆర్ బీఐ స్పష్టం చేసింది. లైసెన్స్ రద్దు చేసినా 98 శాతం కస్టమర్లకు ఎలాంటి నష్టం లేదని ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం.. బ్యాంక్‌లో 98 శాతం మంది డిపాజిటర్లకు వారి డబ్బులు అందుతాయని ఆర్‌బీఐ తెలిపింది. 
బ్యాంక్ దివాలా తీసినప్పుడు లేదా క్లోజ్ అయినప్పుడు డీఐసీజీసీ డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి చెల్లిస్తుంది. ఈ బ్యాంకులో 5 లక్షల వరకు డిపాజిట్ చేసిన వారికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) బ్యాంక్ కస్టమర్లకు వారి డబ్బులు చెల్లిస్తుంది. అయితే రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు ఉంటేనే నష్టపోవాల్సి వస్తుందని, అలాంటి వారు బ్యాంకులో కేవలం రెండు శాతంలోపే ఉన్నారని ఆర్బీఐ ప్రకటించింది.  అయితే డిపాజిట్ దారులకు కేవలం రూ.5 లక్షల వరకే వస్తాయి. దీంతో రూ.5 లక్షలకు పైన డబ్బులు డిపాజిట్ చేసిన వారు నష్టపోవాల్సి వస్తుంది.