కొన్ని బ్యాంకుల్లో లక్షల్లో ఫేక్ అకౌంట్లు: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ

కొన్ని బ్యాంకుల్లో లక్షల్లో ఫేక్ అకౌంట్లు: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ

న్యూఢిల్లీ: మోసపూరిత ట్రాన్సాక్షన్లు, ఎవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రీన్ లోన్ల (వడ్డీ మాత్రమే చెల్లించే లోన్ల) కోసం కొన్ని బ్యాంకుల్లో లక్షల ఫేక్ అకౌంట్లు ఉన్నాయని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.   కొన్ని బ్యాంకులు ఇంటర్నల్ అకౌంట్ల (కస్టమర్ల కోసం కాకుండా ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్ల కోసం ఓపెన్ చేసే అకౌంట్లు) ను మేనేజ్ చేయడంలో ఫెయిల్  అయ్యాయని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నారు.

 గత రెండేళ్లుగా ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టామని, కొన్ని బ్యాంకుల్లో ఎటువంటి కారణం లేకుండానే లక్షల్లో ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లు ఉన్నాయని తెలిపారు.  ఈ అకౌంట్లను రేషనలైజ్ చేయాలని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను ఆదేశించామన్నారు. బ్యాంకుల ఎండీ, సీఈఓలతో పాటు టాప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు పారదర్శకంగా ఉండాలని సలహా ఇచ్చారు.  డిజిటల్ ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు  ఇల్లీగల్ అకౌంట్లను అరికట్టాలని  బ్యాంకుల చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కిందటి వారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా సూచించారు.