
ముంబై: ఇప్పటికీ ఆర్థిక సేవలు అందని వర్గాలపై దృష్టి సారించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ కోరారు. ఆర్థిక సేవలను మరింతగా విస్తరించాలని అన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. డబ్బున్న వారికి సేవలు అందించడం లాభదాయకం అయినప్పటికీ, చిన్న సంస్థలపై, సేవలు అందనివారిపై దృష్టి పెట్టాలని సూచించారు.
సీనియర్ సిటిజన్లు, తక్కువ డిజిటల్ పరిజ్ఞానం ఉన్నవారు, ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని సులభంగా ఉపయోగించగలిగేలా ఉత్పత్తులను, సేవలను రూపొందించాలన్నారు. భారతీయ ఫిన్‌టెక్‌ల సంఖ్య 10 వేలకు పెరిగిందని, గత దశాబ్దంలో ఈ కంపెనీలు కలిసికట్టుగా 40 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించాయని చెప్పారు.
చిన్న వ్యాపారాలు, వ్యక్తులకు లోన్లు అందేలా చూడాలని కోరారు. డిజిటల్ మోసాలు రిజర్వ్ బ్యాంక్‌కు సమస్యగా మారుతున్నాయని మల్హోత్రా తెలిపారు.