వీలుంటే సెటిల్‌ చేసుకోండి... ఎన్​పీఏల విషయంలో బ్యాంకులకు ఆర్​బీఐ సూచన

వీలుంటే సెటిల్‌ చేసుకోండి... ఎన్​పీఏల విషయంలో బ్యాంకులకు ఆర్​బీఐ సూచన

ముంబై: ఉద్దేశ పూర్వక ఎగవేతలు, ఫ్రాడ్​ అకౌంట్ల సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బ్యారోవర్లతో రాజీ కుదుర్చుకోవాలని బ్యాంకులకు ఆర్​బీఐ సూచించింది. దీనివల్ల వీలైనంత ఎక్కువ మొత్తంలో మొండిబాకీలు వసూలవుతాయని పేర్కొంది. కాంప్రమైజ్​ సెటిల్​మెంట్స్, టెక్నికల్​ రైటాఫ్స్​ కోసం అన్ని రెగ్యులేటెడ్​ సంస్థల (ఆర్​ఈలు) బోర్డులు ప్రత్యేక విధానాలను ఆమోదించాలని సూచించింది. అయితే ఎన్​పీఏ గడువు, తాకట్టు పెట్టిన ఆస్తుల తరుగుదలను దృష్టిలో ఉంచుకొని రాజీకి వెళ్లాలని పేర్కొంది. ఆర్​బీఐ రిపోర్ట్​ ప్రకారం...  ఇలాంటి కేసుల్లో సిబ్బంది జవాబుదారీతనాన్ని పరిశీలించడానికి విధానాలను, గ్రేడెడ్ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను కూడా తయారు చేయాలి.  ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసాలుగా వర్గీకరించిన ఖాతాలపై జరుగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్​కు పక్షపాతం లేకుండా సహకరించాలి. ఎన్​పీఏ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్​ వరకు చేరుకున్నప్పుడు ప్రస్తుత వాస్తవిక విలువను లెక్కించిన తర్వాత కాంప్రమైజ్​ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లు 
కుదుర్చుకోవాలి. వాస్తవిక విలువను లెక్కించడానికి సంబంధించిన పద్ధతి కూడా పాలసీలో భాగంగా ఉంటుంది. రెగ్యులేటెడ్ ఎంటిటీ (ఆర్​ఈ) లు కనీస ఖర్చుతో బ్యారోవర్​ నుండి సాధ్యమైనంత ఎక్కువ అప్పును రికవరీ చేయాలి. క్రాంపమైజ్​ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లు,  టెక్నికల్ రైటాఫ్‌‌‌‌‌‌‌‌ల విషయంలో బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌లో ఏ విధంగానూ పక్షపాతం చూపకూడదు.   వ్యవసాయ క్రెడిట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌లు కాకుండా ఇతర ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి కూలింగ్ పీరియడ్​ 12 నెలల వరకు ఉండాలి.

సమాచారం దాచిన కంపెనీల వివరాలు ఇవ్వండి

  • సీఆర్​ఏలను కోరిన ఆర్​బీఐ

 బ్యారోవర్​  క్రెడిట్ -విలువను అంచనా వేయడానికి ఉపయోగించే సమాచారాన్ని దాచిన కంపెనీల వివరాలను ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) క్రెడిట్ రేటింగ్ సంస్థలను కోరింది. భారతదేశంలో రేటింగ్​ఉన్న 40 వేల కంపెనీలలో దాదాపు సగం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు (సీఆర్​ఏలు) సహకరించడం లేదు. ‘‘అటువంటి రేటింగ్‌‌‌‌‌‌‌‌లు ఎన్ని ఉన్నాయి ? ఈ బ్యారోవర్​లు సమాచారాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదు? వారు ఎప్పటి నుండి సహకరించడం లేదు ? వంటి వివరాలను ఆర్​బీఐ తెలుసుకోవాలనుకుంటోంది. ఇటువంటి రేటింగ్‌‌‌‌‌‌‌‌లలో ఎక్కువ సంఖ్యలో బ్యాంకు లోన్లకు సంబంధించినవి కాబట్టి ఆర్​బీఐ దీనిపై దృష్టి సారించింది" అని ఈ సంగతి తెలిసిన వ్యక్తి చెప్పారు. ఈ మేరకు ఆర్​బీఐ నుంచి గత నెల సీఆర్​ఏలకు ఆదేశాలు అందాయి. కంపెనీలు సమాచారం ఇవ్వనప్పుడు, రేటింగ్ ఏజెన్సీలు పబ్లిక్‌‌‌‌‌‌‌‌గా అందుబాటులో ఉన్న డేటాపై ఆధారపడతాయి. ఆర్థిక సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించే బ్యారోవర్ల  రేటింగ్‌‌‌‌‌‌‌‌ను ఉపసంహరించుకుంటాయి.  కంపెనీలు క్రెడిట్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం వాడిన సమాచారం  వివరాలను ఇవ్వాలని రేటింగ్ ఏజెన్సీలను ఆర్​బీఐ అడిగింది. ఇటువంటి రేటింగ్స్​ను "ఇష్యూయర్ నాట్ కోఆపరేట్" (ఐఎన్​సీ)గా వర్గీకరిస్తారు.  తగిన సమాచారం లేనప్పుడు, సీఆర్​ఏలు ఐఎన్​సీ రేటింగ్స్​ కోసం డిబెంచర్ ట్రస్టీలు,  బ్యాంకర్లు,  ఆడిటర్ల రిపోర్టులను ఉపయోగిస్తాయని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.