పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందొచ్చు

పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందొచ్చు

డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చాక చాలామంది పని సులువు అయిపోయింది. ఒక్క క్లిక్ తో పేమెంట్స్ చేసేస్తున్నారు. అయితే.. అప్పుడప్పుడు నెట్ వర్క్ సరిగా లేక, బ్యాంకు సర్వర్ పనిచేయక పేమెంట్స్ నిలిచిపోతుంటాయి. అటు మనీ సెండ్ చేసిన వాళ్లకు వెళ్లక, మర్చంట్ కు రాక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పోగొట్టుకున్న డబ్బు గురించి ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు. అలాంటివాళ్ల పని సులువు అయ్యేలా, పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందేలా ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 

ముందుగా మీరు డబ్బు పంపిన యూపీఐ (పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే) యాప్ ల నుంచి కస్టమర్ సర్వీస్ కి ఫిర్యాదు చేయాలి. అక్కడ సాయం అందకపోతే ఎన్ పీసీఐ (NPCI) పోర్టల్లో 'WHAT WE DO' అనే ఆప్షన్ లోనైనా, లేదంటే బ్యాంక్ లో నైనా కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ పని జరగకపోయినా bankingombudsman.rbi.org.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈ సర్వీస్ తో మీరు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందొచ్చు. హ్యాకర్ల ద్వారా పోగొట్టుకున్న డబ్బును కూడా ఫ్రీజ్ చేయొచ్చు. దానికి కూడా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు.