
ముంబై: పేటీఎం యాప్ యూపీఐ పేమెంట్స్ బిజినెస్ ఇక నుంచి కూడా కొనసాగేందుకు వీలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా (టీపీఏపీ) మారే అవకాశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను కోరినట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం నుంచే ఈ అభ్యర్థన వచ్చినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర బ్యాంకులకు '@ పేటీఎం' హ్యాండిల్ ద్వారా డబ్బులు పంపించుకోవడానికి వీలు కల్పించాలని కోరింది. ఉల్లంఘనల కారణంగా వచ్చే నెల 15 తర్వాత డిపాజిట్లు తీసుకోవద్దని, వాలెట్లను లోడ్ చేసుకోనివ్వద్దని, లోన్స్ ఇవ్వకూడదని ఆర్బీఐ పేటీఎంపై రిస్ట్రిక్షన్లు విధించింది.