వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్: ఆర్బీఐ గవర్నర్

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్: ఆర్బీఐ గవర్నర్
  • ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు

కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్. మూడు నెలలకోసారి ప్రకటించే త్రైమాసిక ద్రవ్య విధానాన్ని ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వడ్డీ రేట్లను వరుసగా ఎనిమిదో సారి యథావిధిగా ఉంచారు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్టు శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని కంట్రోల్ చేయడంతో పాటు గ్రోత్‌ రేట్‌ను పెంచడం కోసం వడ్డీ రేట్లను అలానే ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. గత త్రైమాసికంతో పోలిస్తే మన దేశ ఎకానమీ వేగంగా పుంజుకుంటోదన్నారు. గ్రోత్ రేట్‌, ద్రవ్యోల్బణంలో మార్పులు ఊహించిన దాని కంటే బెటర్‌‌గా ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. 2022లో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండే అవకాశముందని చెప్పారు. మరోవైపు.. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు శక్తికాంతదాస్.

మరిన్ని వార్తల కోసం..

మగాళ్లను ప్రశ్నించే సత్తా లేదా?: సమంత

ప్రచారంలో పాట పాడి, స్టెప్పులేసిన బాబు మోహన్

డేరా బాబా కేసులో కోర్టు తీర్పు