గుడ్ న్యూస్.. ఇప్పుడు 2వేల నోట్లను పోస్టాఫీస్లో కూడా మార్చుకోవచ్చు

గుడ్ న్యూస్.. ఇప్పుడు 2వేల నోట్లను పోస్టాఫీస్లో కూడా మార్చుకోవచ్చు

రద్దయిన 2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కార్యాలయాల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై రద్దయిన 2 వేల రూపాయల నోట్లను పోస్టాఫీసుల ద్వారా కూడా మార్చుకోవచ్చని తెలిపింది. 2016లో నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2వేల నోట్లను ఉపసంహరించుకోవాలని 2023 మేలో ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఈ నోట్లు చాలావరకు వినియోగం లేవని, వాటి జీవిత కాలం దాటి పోతున్నందున్నందున వానిటి రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. 

మే 2023 నాటికి చెలామణిలో ఉన్న 2వేల నోట్లలో 97.38 శాతానికి పైగా తిరిగి వచ్చాయి. బ్యాంకు కౌంటర్లలో మార్పిడి లేదా డిపాజిట్ కోసం అనుమతించిన తర్వాత ఆర్బీఐ నోట్లను మార్చుకోవడానికి ఇతర ఛానెల్ లను అందుబాటులోకి తెచ్చింది. 
తాజాగా పోస్టాఫీసుల్లో కూడా రద్దయిన 2వేల నోట్లను మార్చుకోవచ్చని ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ లో ఓ వ్యక్తి ప్రశ్నించగా .. పోస్టాఫీసు లలో ఒకేసారి 20వేల పరిమితి వరకు నోట్లను మార్చుకోవచ్చని లేదా డిపాజిట్ చేయొచ్చని  తెలిపింది.