రూపాయి విలువ పడిపోకుండా చూడటానికి 7.7 బిలియన్ డాలర్లు అమ్మిన ఆర్బీఐ

 రూపాయి విలువ  పడిపోకుండా చూడటానికి 7.7 బిలియన్ డాలర్లు అమ్మిన ఆర్బీఐ

ముంబై:   రూపాయి విలువ  పడిపోకుండా చూడటానికి, మారకం రేటులో అస్థిరతను అరికట్టడానికి ఆర్​బీఐ ఈ ఏడాది ఆగస్టు నెలలో 7.7 బిలియన్​ డాలర్లను (సుమారు రూ. 67,767 కోట్లు) విక్రయించింది. ఆర్​బీఐ జులైలో అమ్మిన డాలర్లతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.  జులై, ఆగస్టు నెలల్లో డాలర్లను కొనుగోలు చేయలేదు. 

రూపాయి -డాలర్​ మారకం రేటు కోసం ఒక నిర్దిష్ట స్థాయిని లక్ష్యంగా పెట్టుకోబోమని,  ఎక్కువ అస్థిరత ఉన్నప్పుడు మాత్రమే విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో జోక్యం చేసుకుంటామని ఆర్​బీఐ స్పష్టం చేసింది. ఆగస్టు నెలలో రూపాయి 1.6 శాతం మేర పడిపోయింది. 

టారిఫ్​ వార్​ వంటి వాణిజ్య ఇబ్బందులు, ప్రపంచవ్యాప్త అనిశ్చితులు,  ఎఫ్​ఐఐలు భారీగా పెట్టుబడులు అమ్మడంతో సెప్టెంబర్​లోనూ రూపాయి విలువ యూఎస్​ డాలర్​తో పోలిస్తే తగ్గింది.