
ప్రైవేట్ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) హెచ్చరికలు జారీ చేసింది. రహస్యంగా ఉంచాల్సిన నివేదికను బయట పెట్టినందుకు RBI…. ఎస్ బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఈ వారం ప్రారంభంలో ఎస్ బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల కేటాయింపుల గురించి ఎలాంటి సీక్రెట్ పాటించలేదని RBI గుర్తించిదని ఎస్ బ్యాంకు ప్రకటనలో తెలిపింది. కాగా ఎస్ బ్యాంకు ఆర్‌బీఐ BSEకి దీనిపై వివరణ ఇస్తూ.. ఆర్‌బీఐ నుంచి తాము హెచ్చరిక లేఖ అందుకున్నామని తెలిపింది. నిబంధనల ప్రకారం రహస్యంగా ఉంచాల్సిన సమాచారం బహిరంగ పర్చడానికి ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణించిందని తెలిపింది. ఆర్‌బీఐ 2015లో మొట్ట మొదటిసారి అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) లో బ్యాంకు ఇచ్చిన కొన్ని కార్పొరేట్ రుణాలు .. పూర్తి బలహీనపడ్డాయని.. అయినా బ్యాంకు తన ఖాతా పుస్తకాల్లో స్టాండర్డ్ ఖాతాలుగా చూపించాయని గుర్తించింది. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.4,176 కోట్ల ఎన్‌పీఏలను చూపించలేదని.. మొత్తానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట ఎన్‌పీఏ రూ. 8,378.8 కోట్లకు గాను రూ.2018 కోట్లు చూపించింది. దీన్ని బట్టి చూస్తే మొండిబకాయిల కంటే మూడు రెట్లు రూ.6355 కోట్లు చూపించకుండా దాచి పెట్టిందని ఆర్‌బీఐ గుర్తించింది.