చెలరేగిన రైజర్స్ బౌలర్స్.. తక్కువ స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ

చెలరేగిన రైజర్స్ బౌలర్స్.. తక్కువ స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ

అబుదాబి: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 132 పరుగుల టార్గెట్‌ ను నిర్దేశించింది. సన్ ‌రైజర్స్‌ బౌలర్లు దుమ్మురేపడంతో ఆర్సీబీ తక్కువ స్కోరుకే పరిమితమైంది.  హోల్డర్‌, నటరాజన్‌లు తమ పేస్ ‌తో ఆర్సీబీకి చుక్కలు చూపించారు. ప్రారంభంలోనే ఆర్సీబీని హోల్డర్‌ గట్టి దెబ్బకొట్టాడు. కోహ్లి, పడిక్కల్‌ లను తన వరుస ఓవర్లలో పెవిలియన్ ‌కు పంపి సన్ ‌రైజర్స్‌కు మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఆర్సీబీ జట్టులో ఏబీ డివిలియర్స్‌((56) హాఫ్‌ సెంచరీకి జతగా అరోన్‌ ఫించ్‌(32) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో ఆర్సీబీ 7 వికెట్లకు 131 రన్స్ మాత్రమే చేసింది.

సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లు సాధించగా, నటరాజన్‌ రెండు వికెట్లు తీశాడు. నదీమ్‌కు వికెట్‌ దక్కింది.