స్టార్ ఆల్ రౌండర్ వచ్చేసాడు: RCB జట్టు నుంచి షాబాజ్ అహ్మద్ ఔట్

స్టార్ ఆల్ రౌండర్ వచ్చేసాడు: RCB జట్టు నుంచి షాబాజ్ అహ్మద్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి ఈ రోజే(నవంబర్ 26) చివరి రోజు. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల విషయంలో రిటైన్, ట్రేడింగ్ చేసుకునే పనిలో ఉంది. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు ట్రేడింగ్ లో ఒక దేశవాళీ ఆటగాడిని తీసుకుంది. గత కొన్ని సీజన్ లుగా ఆర్సీబీ జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షాబాజ్ ను ఆ జట్టు వదులుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సన్‌రైజర్స్ హైదరాబాద్ నుండి మయాంక్ డాగర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. షాబాజ్ నదీమ్ శనివారం(నవంబర్ 25) ట్రేడయ్యాడు.

IPL 2023 వేలం సమయంలో మయాంక్ దాగర్ ను SRH జట్టు 1.8 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీకి చెందిన స్పిన్ ఆల్ రౌండర్ మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒక వికెట్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ నాణ్యమైన స్పిన్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల ఈ ఆల్ రౌండర్ పై ఆర్సీబీ నమ్మకముంచింది. షాబాజ్ ప్లేస్ లో మయాంక్ దాగర్ ను తీసుకోవడంపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు షాబాజ్ కన్నా బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.        
 
మరో వైపు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో షాబాజ్ ఆర్సీబీ తరపున చెత్త ప్రదర్శన చేసాడు.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై ఆ జట్టుకు భారంగా మారాడు. 2023 సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక వికెట్ మాత్రమే తీసుకోగా.. ఆరు ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు చేశాడు. ఇటీవలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ప్రభావం చూపించలేకపోయారు. IPL 2022 మెగా వేలం సమయంలో RCB 2.4 కోట్లకు షాబాజ్ ను రెటైన్ చేసుకుంది.