RCB Victory Parade: ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ వెయిటెడ్ మూమెంట్ మళ్లీ రిపీట్ అయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీని గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం రాత్రి జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT)పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో బెంగళూరు నగరంలోని తమ కోసం ఈసారి కూడా విక్టరీ పరేడ్ జరుగుతుందని ఆశించిన అభిమానుల ఆశలపై ఆర్సీబీ ఫ్రాంఛైజీ నీళ్లు చల్లింది. రాయల్ ఛాలెంజర్స్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ '12th Man Army' అభిమానులకు ఒక కీలక విజ్ఞప్తిని చేసింది.
ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకోండి.. రోడ్లపైకి రావొద్దు:
ఈసారి ఆర్సీబీ ఎలాంటి 'విక్టరీ పరేడ్' నిర్వహించడం లేదని మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అభిమానులంతా రోడ్లపైకి వచ్చి రచ్చ చేయకుండా, ఇళ్లలోనే ఉండి ప్రశాంతంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరింది. వచ్చే ఏడాది మళ్లీ స్టేడియంలో కలుద్దాం 12th Man Army.. అంత వరకు ఆనందాన్ని పంచుతూ, మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అంటూ ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది.
విక్టరీ పరేడ్ రద్దుకి అసలు కారణం ఇదేనా?:
ఆర్సీబీ యాజమాన్యం ఇంత సీరియస్‌గా మెసేజ్ ఇవ్వడం వెనుక గత ఏడాది జరిగిన ఒక చేదు జ్ఞాపకం దాగి ఉంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తన ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానులు చేసిన హంగామా పెద్ద తొక్కిసలాటకు దారి తీసింది. ఆ దురదృష్టకరమైన ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఎలాంటి రోడ్ షోలు, పబ్లిక్ ర్యాలీలు వద్దని గట్టిగా డిసైడ్ అయింది. ఫ్యాన్స్ సేఫ్టీనే మాకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తూ, అందరూ ఇళ్లలోనే ఉండి సేఫ్‌గా ఎంజాయ్ చేయాలని ఆర్సీబీ కోరడంతో.. అభిమానులు షాక్ కి గురయ్యారు.
What a night. What a feeling. 🥹
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️
As the celebrations begin, let’s be responsible. 🙌
Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a
