RCB vs RR Eliminator: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో విధ్వంసకర హిట్టర్

RCB vs RR Eliminator: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది  జట్టులో విధ్వంసకర హిట్టర్

ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం(మే 22) నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఎలిమినేటర్‌ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ సారథి సంజూ శాంసన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి మంచు కురిసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆర్సీబీ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా.. రాజస్థాన్ టీమ్‌లోకి విండీస్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్ తిరిగొచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా హెట్మెయర్ బరిలోకి దిగనున్నాడు.

భీకర ఫామ్‌లో ఆర్‌సీబీ

ఆశలు లేని స్థితి నుంచి వరుసగా ఆరు విజయాలతో బెంళూరు ప్లేఆఫ్స్‌కు దూసుకొస్తే..ప్రథమార్ధంలో అసాధారణ ఆటతో అగ్రస్థానంలో నిలిచిన రాయల్స్‌..ఆ తర్వాత ఓటములతో టాప్‌-4లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పట్టనుండగా, గెలిచిన టీమ్‌ క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌తో తలపడనుంది.

తుది జట్లు

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, యష్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.