ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం గురువారం (నవంబర్ 27) న్యూఢిల్లీలో జరిగింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మెగా ఆక్షన్ లో తమ ఐదు జట్లను పటిష్టం చేసుకున్నాయి. ఈ మెగా వేలంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. అనుష్క శర్మ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలో పోటీ పడింద. అనుష్క శర్మ అంటే వెంటనే కోహ్లీ భార్య అని గుర్తుకొస్తే పొరపాటే. ఆమె మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా క్రికెటర్. లోయర్ ఆర్డర్ లో హార్డ్ హిట్టింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ కూడా వేయగలదు.
రూ. 10 లక్షల కనీస ధరతో వేలల్లోకి వచ్చిన అనుష్కను కొనడానికి రాయల్ ఛాలెంజర్స్ బాగా ఆసక్తి చూపించింది. రూ.40 లక్షల వరకు బిడ్ కొనసాగించింది. చివరికి రూ.45 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ సీన్ మెగా ఆక్షన్ లో హైలెట్ గా మారింది. ఈ 22 ఏళ్ళ మధ్యప్రదేశ్ ప్లేయర్ ఒకవేళ ఆర్సీబీ జట్టులో ఉంటే "అనుష్క శర్మ" అని పేరు పెట్టుకున్న ఆమె బాగా వైరల్ అయ్యేది. ఎందుకంటే ఆర్సీబీ జట్టు అంటే విరాట్ కోహ్లీ పేరు మారుమ్రోగుతుంది.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కావడం.. అదే పేరున్న ప్లేయర్ అనుష్క శర్మ మహిళల ఆర్సీబీ జట్టులోకి వస్తే ఆమె పేరు బాగా పబ్లిసిటీ అవ్వడం ఖాయం. కానీ గుజరాత్ టైటాన్స్ అనుష్కను దక్కించుకుంది. ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అక్టోబర్‌లో జరిగిన సీనియర్ ఉమెన్స్ ఇంటర్-జోనల్ టీ20 ట్రోఫీలో లిస్ట్ ఏ లో సెంట్రల్ జోన్ తరపున ఆడుతూ 63 యావరేజ్.. 125 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసింది. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున అద్భుతంగా రాణించింది. దూకుడుగా ఆడుతూ తన స్పిన్ బౌలింగ్ లోనూ రాణిస్తుంది.
ఈ మెగా ఆక్షన్ లో హైలెట్స్ చూస్తే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర లభించింది. యూపీ వారియర్స్ ఈ ఆల్ రౌండర్ ను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ యంగ్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో మెరుపు సెంచరీ చేసిన మెగ్ లానింగ్ ను 1.9 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.భారత స్పిన్నర్ శ్రీ చరనికి మంచి ధర లభించింది. రూ. 1.3 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆఫ్ స్పిన్నర్ ను దక్కించుకుంది.
సీనియర్ ప్లేయర్, గత సీజన్ లో ఆర్సీబీ జట్టుకు ఆడిన సోఫీ డివైన్ ను రూ. 2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాపై సెంచరీ కొట్టిన ఈ ఆసీస్ ఓపెనర్ ను రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ ప్రతీకా రావల్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయింది. రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లో వచ్చిన ప్రతీకా రావల్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు.
భారత స్టార్ ఆల్ రౌండర్ శిఖా పాండే జాక్ పాట్ కొట్టింది. ఏకంగా రూ.2.4 కోట్ల భారీ ధరకు శిఖా పాండేను యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన శిఖా పాండే కోసం ఆక్షన్‌లో ప్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రూ.రూ.2.4 కోట్ల భారీ ధరకు యూపీ వారియర్స్ శిఖాను దక్కించుకుంది.
Gwalior, Madhya Pradesh: In the Women’s Premier League (WPL), Gwalior’s Anushka Sharma has been picked by the Gujarat Giants (GG) for ₹45 lakh in the auction. Anushka will now be seen playing for the Gujarat Giants pic.twitter.com/8eifDEjcbL
— IANS (@ians_india) November 28, 2025
