ఢిల్లీ ఢమాల్..47 రన్స్‌‌‌‌‌‌‌‌తో క్యాపిటల్స్‌‌పై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ సూపర్ విక్టరీ

ఢిల్లీ ఢమాల్..47 రన్స్‌‌‌‌‌‌‌‌తో క్యాపిటల్స్‌‌పై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ సూపర్ విక్టరీ
  •     మెరిసిన రజత్, జాక్స్, గ్రీన్

బెంగళూరు: ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాయల్ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు అదరగొట్టింది. గెలిస్తే రేసులో మరింత ముందుకెళ్లే  ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం డీలా పడింది.  సొంతగడ్డపై ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 47 రన్స్ తేడాతో ఢిల్లీని పడగొట్టిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ  ఆరో విక్టరీతో పట్టికలో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకొచ్చింది. తొలుత ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 187/9 స్కోరు చేసింది. 

రజత్ పటీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), విల్ జాక్స్ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), కామెరూన్ గ్రీన్ (32 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రసిఖ్ ధార్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ  19.1 ఓవర్లలో 140 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. స్టాండిన్ కెప్టెన్ అక్షర్ పటేల్ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ మూడు, ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఓ వికెట్‌‌ కూడా తీసిన గ్రీన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

రాణించిన రజత్‌‌‌‌‌‌‌‌, జాక్స్‌‌‌‌‌‌‌‌

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ రజత్ పటీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విల్ జాక్స్‌‌‌‌‌‌‌‌ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 88 రన్స్‌‌‌‌‌‌‌‌ కీలక భాగస్వామ్యంతో మంచి  స్కోరు చేసింది. ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న విరాట్ కోహ్లీ (27) స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్స్‌‌‌‌‌‌‌‌గా మలచిన అతను  ఖలీల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా కవర్ మీదుగా క్లాసిక్ సిక్స్ కొట్టాడు. అయితే,  ముకేశ్ వేసిన మూడో ఓవర్లో డుప్లెసిస్ (6) ఔటవగా.. ఇషాంత్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా 4, 6తో ఆకట్టుకున్న విరాట్ అదే ఓవర్లో కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు పడ్డా యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ రజత్ పటీదార్, విల్ జాక్స్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని ముందుకు తీసుకెళ్లారు. 

ముఖ్యంగా  రజత్‌‌‌‌‌‌‌‌ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.  ముకేశ్ ఓవర్లో మూడు ఫోర్లు.. అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. అటువైపు జాక్స్ కూడా భారీ షాట్లతో చెలరేగడంతో పదో ఓవర్లోనే స్కోరు వంద దాటింది. ఇక్కడి నుంచి ఢిల్లీ బౌలర్లు పుంజుకున్నారు.  వరుసగా  ఏడు ఓవర్లలో కేవలం రెండే ఫోర్లు ఇచ్చి క్రీజులో కుదురున్న పటీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాక్స్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశారు. దాంతో16 ఓవర్లకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ 147/4తో నిలిచింది. అయితే, కుల్దీప్ వేసిన 17వ ఓవరలో గ్రీన్ రెండు భారీ సిక్సర్లు కొట్టగా.. లోమ్రోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13) సిక్స్ కొట్టడంతో ఏకంగా 22 రన్స్ వచ్చాయి. కానీ, చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్లు 18 రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.  

దెబ్బ మీద దెబ్బ

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్నర్ (1)ను ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌కే ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన స్వప్నిల్ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. యశ్ దయాల్ వేసిన మూడో ఓవర్లో అభిషేక్ పోరెల్ (2) వెనుదిరగ్గా.. వచ్చీరాగానే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఊపు మీద కనిపించిన ఇన్‌‌‌‌‌‌‌‌ఫామ్ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌‌‌‌‌‌‌‌గర్క్ (21) తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే రనౌటయ్యాడు.  

ఆ వెంటనే కుమార్ కుశాగ్ర (2)ను సిరాజ్ ఎల్బీ చేయడంతో ఢిల్లీ 30/4తో ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో స్టాండిన్ కెప్టెన్  అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు.  భారీ షాట్లతో అలరించిన అతను  షై హోప్‌‌‌‌‌‌‌‌ (29)తో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 56 రన్స్ జోడించి డీసీని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ,  పదో ఓవర్లో హోప్‌‌‌‌‌‌‌‌ను ఔట్ చేసిన ఫెర్గూసన్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి కీలక బ్రేక్ ఇవ్వగా.. వెంటనే అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమన్వయ లోపంతో ట్రిస్టాన్ స్టబ్స్ (3) రనౌటయ్యాడు. ఇంకాసేపు ప్రతిఘటించిన అక్షర్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత యశ్ దయాల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వెనుదిరగడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. 

 సంక్షిప్త స్కోర్లు

బెంగళూరు: 20 ఓవర్లలో 187/9 (రజత్ 52, జాక్స్ 41, రసిఖ్ దార్ 2/23)
ఢిల్లీ:  19.1 ఓవర్లలో 140 ఆలౌట్ (అక్షర్ 57, యశ్  దయాల్ 3/20, ఫెర్గూసన్ 2/23)