నవీ ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మాయిల జట్టుకు ఎదురులేకుండా పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన (61 బాల్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో విజృంభించిన వేళ లీగ్‌లో వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 166 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (62) ధాటిగా ఆడి జట్టును ఆదుకోగా, చివర్లో లూసీ హామిల్టన్ (36), స్నేహ్ రాణా (22) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్, సయాలి సత్ఘారే చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్మృతికి తోడు జార్జియా వోల్ (54 నాటౌట్) మెరుపులతో ఆర్సీబీ 18.2 ఓవర్లలో 169/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. స్టార్టింగ్ నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన మంధాన.. రెండో వికెట్‌కు వోల్‌తో 142 రన్స్ జోడించింది. తన జోరు చూస్తుంటే లీగ్‌లో తొలి సెంచరీతో రికార్డు సృష్టించేలా కనిపించింది. వందకు నాలుగు రన్స్ దూరంలో ఔటైన ఆమె ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్‌గా హర్మన్ (2024లో గుజరాత్‌పై 95 నాటౌట్) రికార్డును బ్రేక్ చేసింది. మంధానకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
