అహ్మదాబాద్: ఐపీఎల్19లో తాము ఆడడం కాదు.. టోర్నమెంట్‌ను పూర్తిగా శాసించామని ఆర్సీబీ కెప్టెన్రజత్పటిదార్ చెప్పాడు. మ్యాచ్అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పుట్టిన రోజునే ఆర్సీబీ రెండోసారి ఐపీఎల్టైటిల్ను గెలవడం సంతోషంగా ఉందన్నారు.అయితే ఆ సంతోషం కంటే తమ జట్టు చూపించిన ఆధిపత్యంపై మరింత హర్షం వ్యక్తం చేశాడు.
పోటీదారులను హెచ్చరిస్తూ ఆర్సీబీ ఇక్కడితో ఆగిపోబోదని వరుసగా మూడోసారి టైటిల్ గెలవాలనే అంశంపైనే మా దృష్టి ఉంటుందని పేర్కొన్నాడు. తన కెప్టెన్సీ విధానం భిన్నంగా ఉంటుందని, మ్యాచ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటానని చెప్పాడు. మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్ల నుంచి తనకు పూర్తి మద్దతు లభించిందని పేర్కొన్నాడు.
కోహ్లీ గొప్ప ఆటగాడు..
జట్టు వరుసగా రెండో ఏడాది టైటిల్ గెలవడంలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందించిన సహకారాన్ని పటిదార్ ఎంతగానో కొనియాడాడు. "అతడి గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ అద్భుతాలు చేస్తుంటాడు. అతడు ఒక గొప్ప ఆటగాడు. అతడి బ్యాటింగ్ శైలి గురించి అందరికీ తెలిసిందే." అని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌లో 156 పరుగుల ఛేదనలో కోహ్లీ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీని గెలిపించాడన్నాడు.
మొత్తంగా 37 ఏళ్ల కోహ్లీ ఈ సీజన్‌లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 675 పరుగులు చేసి మరో అద్భుతమైన సీజన్‌ను ముగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినట్లు కొనియాడాడు. కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంత శక్తితో ఉంటాడో నెట్స్‌లో ప్రాక్టీస్‌లో కూడా అదే శక్తిని
చూపిస్తాడని చెప్పాడు.
రెండో టైటిల్ సాధించడం అద్భుతం
వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించడం ఆనందంగా ఉందని పాటిదర్అన్నాడు. ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని పవర్‌ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు.
ఆ ప్లాన్‌ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు. భువీ, హాజిల్‌వుడ్, రసిక్, కృనాల్, సుయాశ్ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు. కాగా, పటిదార్ఈ ఐపీఎల్‌లో 192.69 స్ట్రైక్ రేట్‌తో 501 పరుగులు చేశాడు.
