ఆర్సీబీకి బిగ్ షాక్.. స్లార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌‌పై ఒక మ్యాచ్ నిషేధం

ఆర్సీబీకి బిగ్ షాక్.. స్లార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌‌పై ఒక మ్యాచ్ నిషేధం

అహ్మదాబాద్: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్‌‌పై వచ్చే సీజన్‌‌కు ఒక మ్యాచ్ నిషేధం పడింది. గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌‌లో అంపైర్ నితిన్ మీనన్ వైపు ఆగ్రహంతో ఐస్ బ్యాగ్ విసిరినందుకు ఆయన మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, రెండు డెమెరిట్ పాయింట్లు విధించారు. 

ఈ సీజన్‌‌లో డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మూడోసారి. దీంతో ఆయన ఖాతాలో మొత్తం ఐదు డెమెరిట్ పాయింట్లు చేరడంతో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఈ శిక్షను డేవిడ్ అంగీకరించారు.