కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు.. షాపూర్ లో ఘటన

కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు.. షాపూర్ లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: ఓ ప్రైవేట్​ బస్సు ఓ వ్యక్తిని ఢీకొట్టి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఖాజీపల్లిలోని ఆర్డీపీఎల్​ కంపెనీకి చెందిన బస్సు సోమవారం ఉదయం సూరారం నుంచి బాలానగర్​ వైపు వెళ్తోంది. షాపూర్​నగర్​ వద్దకు రోడ్డు దాటుతున్న స్వామి అనే  వ్యక్తిని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న  కల్వర్టును ఢీకొట్టి అందులోకే దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ స్వామిని స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. డ్రైవర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.