నల్గొండ జిల్లాలో రియాక్టర్ పేలుడు

నల్గొండ జిల్లాలో రియాక్టర్ పేలుడు
  • వెలిమినేడు శివారు ఫ్యాక్టరీలో ప్రమాదం
  • రియాక్టర్ పేలి దట్టంగా కమ్ముకున్న విషవాయువులు

నల్గొండ జిల్లా:  చిట్యాలమండలం వెలిమినేడులో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఒక్కసారిగా అందులో ఉన్న విషవాయువులు బయటికి వచ్చి పరిసర ప్రాంతాలను కమ్మివేశాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్ కు చేరుకుని పరిశీలించారు. కంపెనీ పేరు గానీ, ఎం తయారు చేస్తారన్న విషయం తెలియదని స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు.