కాంగ్రెస్, బీజేపీల ఆత్మ గౌరవంపై చర్చకు సిద్ధం

కాంగ్రెస్, బీజేపీల ఆత్మ గౌరవంపై చర్చకు సిద్ధం

పార్టీలో  పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీ వీడుతూ.. బయటికి వెళ్లే సమయంలో ఇలా ఆత్మ గౌరవం కోసం అనడం బాధాకరమని అగ్రోస్ రాష్ట్ర మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మీరు ఆస్తులు సంపాదించుకోలేదా అని ప్రశ్నించారు. మీది ఆత్మ గౌరవమా లేక ఆత్మ వంచననా చెప్పాలంటూ కిషన్ రావు డిమాండ్ చేశారు. మా పార్టీలో అన్ని పదవులూ అనుభవించిన నాయకులు బీజేపీ లో చేరారని.. అలాంటి బీజేపీకి ఆత్మ గౌరవం ఎక్కడిదని దుయ్యబట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ గౌరవం అనే పదం ఉచ్చరించే నైతికత మీకు లేదని ఆయన కరాఖండిగా చెప్పేశారు. అంతే కాదు కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆత్మ గౌరవం మాట్లాడేందుకు తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.