మస్తుగా ల్యాండ్ కొంటున్న డెవలపర్లు.. ఈ సిటీలలోనే ఎక్కువ

 మస్తుగా ల్యాండ్ కొంటున్న డెవలపర్లు.. ఈ సిటీలలోనే ఎక్కువ
  • జనవరి-ఆగస్టులో 2,0‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌18 ఎకరాల కోసం 59 డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ముంబైలో ఎక్కువ.. హైదరాబాద్‌లో కేవలం రెండు డీల్సే

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్ ఫుల్ జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. డెవలపర్లు శరవేగంగా ల్యాండ్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే ఏకంగా 59 ల్యాండ్ డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగాయి. కిందటేడాది జనవరి–ఆగస్టు మధ్య జరిగిన మొత్తం డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ఇది ఎక్కువ.  రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సల్టన్సీ కంపెనీ అనరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా ప్రకారం, ఈ ఏడాది డెవలపర్లు 2,018 ఎకరాలు కొనుగోలు చేశారు.  

కరోనా సంక్షోభం తర్వాత  రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీగా పెరగడమే ఇందుకు కారణం.  కిందటేడాది  ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,438 ఎకరాల కోసం 50 ల్యాండ్ ఒప్పందాలు జరిగాయని అనరాక్ తెలిపింది.  టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి 1,136 ఎకరాల కోసం ఐదు ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డీల్స్ జరిగాయి. మాన్యుఫాక్చరింగ్ (ప్లాంట్ ఏర్పాటుకు)  కోసం 300  ఎకరాల+  ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి జరిగింది.   దేశంలోని టాప్ ఏడు సిటీలలో  రెసిడెన్షియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 38 డీల్స్ జరిగాయని అనరాక్ పేర్కొంది.  283 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కోసం ఈ డీల్స్ జరిగాయని వివరించింది.  ప్లాట్స్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం డెవలపర్లు 154 ఎకరాలు కొనుగోలు చేయగా,   ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెసిడెన్షియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 62 ఎకరాల+ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   కొనుగోలు చేశారు. 

ఈ సిటీలలోనే ఎక్కువ..

ల్యాండ్ డీల్స్ ఎక్కువగా ముంబైలో జరిగాయి. 17 డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సిటీ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో 13 డీల్స్ జరిగాయి. కానీ, ఈ డీల్స్ అన్ని తక్కువ ల్యాండ్ కోసం జరిగాయని అనరాక్ పేర్కొంది. ముంబైలో జరిగిన 17 డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 95+  ఎకరాల కోసం కాగా, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన 13 డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 90 ఎకరాల కోసం జరిగాయి. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కేవలం మూడే ల్యాండ్ డీల్స్  జరిగాయి. కానీ, మొత్తం 740  ఎకరాల కోసం ఈ డీల్స్ జరగడం విశేషం.

బెంగళూరులో సపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎనిమిది ల్యాండ్ డీల్స్ జరిగాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో జరిగిన ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంగళూరు వాటా 20 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 18 ఎకరాల కోసం రెండు డీల్స్ జరిగాయి. మొత్తం ల్యాండ్‌ ట్రాన్సాక్షన్‌లో  ఈ సిటీ వాటా కేవలం ఒక శాతం మాత్రమే. ‘కేవలం కొన్ని డీల్స్ మాత్రమే ఎక్కువ ల్యాండ్ కోసం జరిగాయి’ అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూరి అన్నారు. అతిపెద్ద మూడు ల్యాండ్ డీల్స్ అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగాయని జరిగాయని వివరించారు. 300 ఎకరాలకు పైగా ల్యాండ్ కోసం లుధియానా, బెంగళూరులలో ఒక్కో డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగిందని చెప్పారు.   నెంబర్స్ బట్టి చూస్తే రెసిడెన్షియల్  సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగాయని  అన్నారు.