రియల్ స్టార్ ఉపేంద్ర వరల్డ్ అఫ్ UI రిలీజ్ డేట్ వచ్చేసింది..

రియల్ స్టార్ ఉపేంద్ర వరల్డ్ అఫ్ UI రిలీజ్ డేట్ వచ్చేసింది..

కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూఐ’. రీష్మా నానయ్య,  నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉపేంద్ర రూలర్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.

ఈ చిత్రంతో ప్రేక్షకులను ఓ డిఫరెంట్ ఫాంటసీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకెళ్లనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్​ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.