
రియల్మీ.. జీటీ 6 పేరుతో ఈ నెల 20న హైఎండ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్జెన్3 ప్రాసెసర్, 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఫోన్‌ను 10 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతానికి లేదా 28 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఎల్డీడీఆర్5 ఎక్స్ర్యామ్, యూఎఫ్ఎక్స్ 4 స్టోరేజీ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వెనుక 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, ముందు 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ధర వివరాలను రియల్మీ ప్రకటించలేదు.