
దొంగ దెబ్బ కొట్టడంలో పాక్ కు పెట్టింది పేరు.. తనకు సత్తువ లేకున్నా.. చావ లేకున్నా మధగజమసువంటి భారత్ నే ఢీకొట్టాలని చూస్తుంటది. ఇప్పటికే ఇలా చాలాసార్లు ప్రయత్నించి బోర్లా పడ్డ ఘన చరిత్ర పాకిస్తాన్ ది.
కార్గిల్ యుద్ధ విషయానికి వస్తే… ప్రతీ చలికాలం LOCలో విపరీతమైన చలి ఉంటది.. దీంతో భారత్ పాక్ లమధ్య ఓ ఒప్పందం కుదిరింది. ప్రతీ చలికాలం LOC నుంచి ఇరు దేశాల సైనికులను ఉపసంహరించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో 1999 వ సంవత్సరంలో నియంత్రణ రేక నుంచి భారత బలగాలు వెనక్కి వచ్చాయి. అదే అదునుగా బావించిన పాక్.. తన బలగాలను భారత్ లోకి పంపించాయి.. వారితో పాటు ఉగ్రవాదులు కూడా చొచ్చుకువచ్చారు. భారత్ కు చెందిన 120 శిభిరాలను ఆక్రమించారు.
భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ సౌరబ్ కాలియా టీం గస్తీ కాస్తుండగా… ఉగ్రవాదులు చొరబడినట్లు గుర్తించారు. వందలాదిగా ఉన్న ఉగ్రవాదులను ఎదుర్కొన్న కాలియా టీం దగ్గర బులెట్స్ నిండుకోవడంతో చొరబాటుదారులు వారిని హతమార్చారు. స్థానికుల నుంచి సమాచారాన్ని అందుకున్న భారత ఆర్మీ రంగంలోకి దిగింది. నిటారుగా ఉన్న కొండలపై శత్రువులు చేసే దాడిని ఎదుర్కుంటూ వారిని హతమార్చింది భారత ఆర్మీ. ఈ యుద్ధంలో భారత సైనికులు 550 మంది అమరులవగా పాక్ కు చెందిన దాదాపు 3000 మంది (ఉగ్రవాదులతో పాటు) హతమయ్యారు.
కార్గిల్ యుద్ధం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో మే 3న ప్రారంభమైన యుద్ధం.. జూలై 26 వరకు జరిగింది. భారత భూభాగంలోకి ఎంటరైన పాక్ సైన్యాన్ని తిప్పికొట్టి.. మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీంతో జూలై 26ను విజయ్ దివస్ గా నిర్వహిస్తున్నారు.