సీనియర్లు ముందు.. జూనియర్లు వెనుక కూర్చోవాలె

సీనియర్లు ముందు.. జూనియర్లు వెనుక కూర్చోవాలె

ఎక్కడైనా సీనియర్లు, జూనియర్లు అంటూ తేడా ఉంటది. దీనికి మన పార్లమెంట్ కూడా మినహాయింపు కాదు. లోకసభలో కొత్తగా ఎన్నికై వచ్చిన సభ్యులు వెనకాల కూర్చోవాలంటా. సీనియర్లు మధ్యలో.. ప్రధాని, ఇతర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలు ముందు వరుసలో కూర్చుంటాయట. స్పీకర్ కుడి వైపు అధికార పార్టీకి చెందినవారు కాగ.. ముందు వరుసలో ప్రధాని, మంత్రులు కూర్చుంటరు. ఎడమ వైపుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు కూర్చోగా.. మధ్య వరుసలో సీనియార్టీ ఆధారంగా సీటింగ్ ఏర్పాటు చేస్తరట. అయితే ఈ నిబంధన కారణంగా హేమ మాలిని, సన్నీ డియోల్ ఒకే చోట కూర్చునే అవకాశం పోయింది.

సన్నీ డియోల్ కు పినతల్లి అయిన హేమ మాలిని తన కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయ పాఠాలు చెప్పే అవకాశం కోల్పోయిందట. ఇక  ఈసారి లోక్ సభలో కొత్తగా అడుగుపెట్టిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సన్నీడియోల్ గత ఎన్నికల్లో గురుదాస్ పూర్ నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. సింగర్ హన్స్ రాజ్ హన్స్, క్రికెటర్ గౌతమ్ గంభీర్, సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, ప్రముఖ నటుడు రవికిషన్  లాంటి వారు మొదటిసారిగా లోక్ సభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.