Family Relationship : పెద్దలు ఆశ్రమాల్లో.. పిల్లలు హాస్టళ్లల్లో.. విడిపోతున్న కుటుంబ బంధాలకు కారణం ఏంటీ..?

Family Relationship : పెద్దలు ఆశ్రమాల్లో.. పిల్లలు హాస్టళ్లల్లో.. విడిపోతున్న కుటుంబ బంధాలకు కారణం ఏంటీ..?

అమ్మ, నాన్న, నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, అత్త, మామ, బావ, మరదలు... ఎంతమందో...! అవసరం వస్తే ఆదుకునే వాళ్లు.కష్టాల్లో ఉంటే చేదోడుగా నిలిచే వాళ్లు, మాది చాలామంది బలగం అని గొప్పగా చెప్పుకునే రోజులు పోయాయి. 

మేమిద్దరం, మాకిద్దరు అనే రోజులకూ కాలం చెల్లింది. నలుగురున్న కుటుంబంలో కూడా నలుగురూ నాలుగు చోట్ల ఉంటున్నారు. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు... అదీ సెల్​ ఫోన్లలోనే.... వీడియోకాల్స్​లోనే... ఇదీ మసకబారుతున్న బంధాల దుస్థితిఎవరికి  వాళ్లే... ఒకరితో మరొకరికి సబబంధాల్లేవ్... మాటలూ అంతంత మాత్రమే. ఇదీ నేటి మనుషుల పరిస్థితి కుటుంబం.

 భారతదేశానికి  ఉమ్మడి కుటుంబాలు ఆస్తి లాంటివి అంటారు. కానీ నేడు కుటుంబ వ్యవస్థే ధ్వంసమైపోతోంది. అవసరాలు, తొందరపాటు, ఎదగాలనే ఆశ, టెక్నాలజీ తెచ్చిన చిక్కులు, సంపాదనకోసం ఆరాటం, విదేశాలకు ఎగిరిపోవటం.. కారణాలు ఏదైతేనేం నిండుకుం డలాంటి కుటుంబాలు పగిలిపోతున్నాయ్.   భార్యా భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం పెరిగిపోతోంది. పూడ్చలేనంత ఎడబాటు..!

ALSO READ : ఆలివ్ ఆయిల్ తో వంటే కాదు.. 

భార్య.. భర్త...

కుటుంబబండికి భార్యాభర్తలు రెండు చక్రాల్లాం టి వాళ్లు ఏ చక్రం సరిగా లేకపోయినా కుటుంబం ముందుకు నడవదు. కానీ నేడు విడాకులు ఎక్కు వైపోతున్నాయి. పెళ్లి పట్టుమని పది మాసాలు నిం డకముందు వేరైపోతున్నారు. న్యాయస్థానాలకు వస్తున్న విడాకుల కేసులు చూసి న్యాయమూర్తులే ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు సైతం కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.

 దూరమైన భార్యాభర్తలు పిల్లలను వంచుకుంటున్నారు. లేదా హస్టల్స్ లో  ఉండే వాళ్ల బాగోగులకోసం డబ్బు పంపిస్తున్నారు. చిన్నచిన్న అపోహలు, అహాలు, కోపాలు, ఆర్థిక విషయాలతో విడిపోతున్న భార్యాభర్తలే ఎక్కువ. ఓపిక, ఒర్పు ఉండంలేదు. సర్దుకుపోదాం అనే మంచితనం లేదు. నేనెందుకు భరించాలనే ఆలోచన ఇద్దరి లోనూ ఎక్కువై పోయింది. 

ఒకరు భారతదేశంలో ఉంటే మరొకరు అమెరికాలోనో, ఇంగ్లండ్ లో ఉంటున్న భార్యాభర్తలూ ఉన్నారు. దాంతో వారి బంధం బీటలు వారుతోంది. కుటుంబం కాస్తా కకావికలమై పిల్లల చదువులు, మానసిక ఎదుగుదల జీవన విధానంపై ప్రభావం చూపుతోం ది. భవిష్యత్ చీకటిమయం అవుతోంది.

తల్లిదండ్రులు... పిల్లలు

నిమిషం తీరిక ఉండదు. నగరాల్లో అయితే ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు బయలేరిన తల్లిదండ్రులు సాయంత్రం ఆరు ..ఏడు గంటలకు ఇంటికి వస్తారు. ఎనిమిదికల్లా స్కూల్  కు  వెళ్లిన పిల్లలు నాలుగు గంటల ఇంటికొచ్చి అమ్మానాన్నల కోసం ఎదురు స్తుంటారు. లేదా ట్యూషన్ పేరుతో టీచర్ దగ్గరే ఉండిపోతారు.

ఏడాది పిల్లలను కూడా కేర్ సెం టర్స్ లో  వదిలి సంపాదనకోసం ఉద్యోగాలకు వెళ్తున్నారు నేటి తల్లితండ్రులు.  పిల్లలు అడిగినవన్నీ కొనిస్తున్నారు. ప్రేమాభిమానాలు తప్ప అదేమంటే మేం కష్టడేదంతా  వాళ్లకోసమే కదా అంటున్నారు. కనీసం రోజులో ఒక్క గంట కూడా పిల్లలతో గడపలేనంత బిజీలోఅమ్మానాన్న ఉంటున్నారు.దాంతో పిల్లలు చిన్నప్పటి నుంచి ఒంటరితనంలో పెరుగుతున్నారు. 

స్కూల్ చదువు, హోం వర్క్, మార్కులు, ర్యాంకులు వస్తే చాలని కోరుకొంటున్నారు  తల్లిదండ్రులు. కానీ అమ్మానాన్నలు అందించాల్సిన ఆత్మీయతను మాత్రం వదిలేస్తున్నారు. దాంతో తల్లిదండ్రులు, పిల్లలు మధ్య ఉండాల్సిన రిలేషన్స్ దెబ్బతింటున్నాయి.

ఆశ్రమాల్లో పెద్దవాళ్లు

పిల్లలు విదేశాల్లో, నగరాల్లో ...తల్లిదండ్రులు అనాథ ఆశ్రమాల్లో..  ఇది నేడు ఎక్కువ కుటుంబాల పరిస్థితి. మేం చదువుకోసం ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వచ్చాం.. మరి వాళ్లేమో ఇంతదూరం రాలేదు. అక్కడైతే తోటి వయసువాళ్లతో ఉంటారు. నెలనెలా తప్పకుండా డబ్బులు పంపిస్తున్నాం? అని చెప్పన్నారు యువత కొందరైతే ఆస్తులు రా యించుకుని పెద్దవాళ్లను  వీధిలో వదిలేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తే ముసలి వయసులో ఇలా వదిలేశారని పెద్దలు బాధపడుతున్నారు. 


'మా పిల్లలు బాగా ఎదగాలంటే మేం సంపాదిం చుకోవాలికదా' అనియువతరం అంటోంది. కానీ చిన్నప్పుడు వాళ్లకు సరైన ప్రేమ అందించలేదు. అభిమానం పంచిఉంటే వాళ్లు కన్న తల్లిదండ్రులుకు దూరంగా వెళ్లిపోయేవాళ్లు కాదని తల్లిదండ్రులు గుర్తించడం లేదు. యువత కూడా రేపు తమ పిల్లలూ అలాగే చేస్తారని ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఇంట్లో ఉండే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, పిల్లల పెంపకంలో సాయం చేసేవాళ్లు జీవిత పాఠాలు చెప్పేవాళ్లు.  ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ పేరుతో అన్నింటినీ కోల్పోతున్నారు

దూరమవుతున్న చుట్టాలు

గ్రామాలు, ఊళ్ల నుంచి పట్టణాలు నగరాలకు వలసలు పెరిగిపోయాయి. రాకపోకలు దూరమయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. ఫోన్స్​లో  మాట్లాడటానికి తీరక ఉండటం లేదు. బంధువులను కలవడం తగ్గిపోయింది. నగరాల్లోని వాళ్లు ఏడాదికి ఒకనాడు కూడా పుట్టిన ఊళ్లకు వెళ్లడం లేదు. పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చినా సమ్మర్ క్యాంపుల పేరుతో టూర్స్ కు వెళ్తు న్నారు తప్ప,బంధువుల దగ్గరకు వెళ్లడం లేదు . పెళ్లిళ్లు, పండుగలప్పుడు ఏదో మొక్కుబడికి కలుస్తున్నారు.

 సెలవులు లేవు అని  టైంకు వెళ్లి వెంటనే వచ్చేస్తు న్నారు. పిల్లలకు దగ్గరి బంధువులెవరో కూడా తెలియడం లేదు. దాంతో ఏ కష్టం వచ్చినా ఆదుకునే వాళ్లు ఉండటం లేదు. సంతోషం వస్తే నలుగురితో పంచుకునే వాళ్లూ లేదు. ఎవరితోనూ మానసికంగా దగ్గర కాలేకపోతున్నారు. ఎవరినీ మన స్పూర్తిగా నమ్మడం లేదు. మనవాళ్ళే నన్న  భరోసా లేదు.  ఇదీ నేటి ఆధునిక జీవన శైలి. అందర్నీ దూరం చేసుకుని మనిషి ఒంటరి తనంలో బతుకుతున్నాడు.

కారణాలు కొండంత

నేడు ప్రపంచం గుప్పిట్లోకి వచ్చిందని సంతోషి స్తున్నారు. కానీ బంధాలు రైలుపట్టాల్లా మారు తున్నాయని మాత్రం గుర్తించడం లేదు. ఆశలు ఎక్కువైపోయాయి. సంపాదన మీదమోజు పెరిగి పోయింది.  డబ్బు, హోదా గర్వం మనుషుల్ని దూరం చేస్తున్నాయి. ఉన్నంతలో బతుకుదాం అనే ఆలోచనే లుదె. మునుషుల కన్నా మనీకే విలువ ఇస్తున్నారు. సౌకర్యాల కోసం వెతుకుతున్నారు తప్ప, నిజమైన సంతోషం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. 

సంకుచిత మనస్తత్వంతో అందర్నీ దూరం చేసుకుంటున్నారు. చదువు అంటే పుస్తకాలు తప్ప లోకజ్ఞానం లేకుండా పెరుగుతున్న నేటితరానికి విలువలు నేర్పాల్సిన అదసరం ఉంది. అమ్మానాన్నలు పిల్లలకు గొప్ప చదువులు చెప్పించడంతో పాటు వారితో  సమయాన్నీ గడపాలి.

 పెద్దలపై గౌరవాన్ని చిన్ననాటి నుంచే అలవాటు చేయాలి. తోటి వారితో ఎలా మెలగాలో చెప్పాలి అప్పుడప్పుడు. చుట్టాలు.. స్నేహితులను కలుస్తూ ఉండాలి. అవసరాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ కుటుంబ బంధాన్ని భద్రంగా కొనసాగించాలి.

వెలుగు, లైఫ్