
హైదరాబాద్, వెలుగు: పీడీ యాక్ట్‌ను ఇష్టానుసారంగా నమోదు చేయొద్దని హైకోర్టు పోలీసులకు సూచించింది. సాధారణ క్రిమినల్ యాక్ట్ కింద కేసును విచారించే చాన్స్ ఉన్నప్పుడు పీడీ యాక్ట్ అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిర్బంధంలోకి తీసు కునే ముందు అందుకు కారణాలు వివరించాలని కోర్టు సూచించింది. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన సయ్యద్ అబ్దాహు ఖాద్రి అలియాస్ కసబ్‌ను పీడీ యాక్ట్ కింద నిర్బంధంలోకి తీసుకుంటూ గతేడాది ఆగస్టు లో కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగు ణంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనిని అత ని తల్లి సవాల్ చేస్తూ హేబియస్ కార్పస్ పిటి షన్ దాఖలు చేయగా.. జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జె.శ్రీదేవిల డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.