HM పనితీరు భేష్ : ఆ సర్కార్ బడిలో అడ్మిషన్లు ఫుల్

HM పనితీరు భేష్ : ఆ సర్కార్ బడిలో అడ్మిషన్లు ఫుల్

రెబ్బనపల్లి -స్కూల్ ఎదుట నో అడ్మిషన్ బోర్డు

హెచ్​ఎం సొంత డబ్బులతో ఇద్దరు విద్యావలంటీర్లు

ఎనిమిదేళ్లలో 24 నుంచి 269 పెరిగిన స్ట్రెంథ్​

దండేపల్లి, వెలుగు:సర్కారు స్కూళ్లకు పిల్లలు వరుస కడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా రెబ్బనపల్లి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో అడ్మిషన్లు నిండిపోయాయి. దీంతో స్కూల్​ ఎదుట నో అడ్మిషన్​ బోర్డు పెట్టారు. స్కూల్​ హెచ్​ఎం చొరవతో ఇక్కడి పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. ఎనిమిదేళ్ల క్రితం 24 మంది ఉన్న ఈ స్కూల్​లో ప్రస్తుతం 267 మంది ఉన్నారు. తమ పిల్లల్ని చేర్పించడానికి వస్తున్న తల్లిదండ్రులు ఈ బోర్డును చూసి, వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

హెచ్​ఎం చొరవతో..

స్కూల్​ హెచ్​ఎం​ అర్చన ఇక్కడికి 2013లో వచ్చారు. అప్పట్లో 24 మంది స్టూడెంట్లు మాత్రమే ఉండటంతో ఆశ్చర్యపోయిన ఆమె.. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించి, మంచి చదువులు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఏటా టీచర్లతో కలిసి ఇంటింటి వెళ్లి, పిల్లల్ని బడిలో చేర్పించేలా చేశారు. గ్రామస్తులు సూచన మేరకు 2016లో ఇంగ్లీష్​ మీడియం క్లాసులను ప్రవేశపెట్టారు. సరిపడా టీచర్లు లేకపోవడంతో గ్రామస్తుల విరాళాలతో ఇద్దరిని, ప్రిన్సిపల్ తన సొంత ఖర్చులతో మరో ఇద్దరు వలంటీర్లను నియమించారు. అంతేకాక ఏటా పేద పిల్లలకు బూట్లు, బ్యాగులు, పెన్నులను కూడా హెచ్​ఎం​ కొనిస్తున్నారు. ఆమె సేవలను గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు.

అందరి చూపు ఆ స్కూల్ వైపే

మరిన్ని రూంలు అవసరం

ఈ ఏడాది పిల్లల సంఖ్య 267కి చేరడం సంతోషంగా ఉంది. నా సొంత ఖర్చులతో పాటు, గ్రామస్తుల డొనేషన్​తో విద్యావలంటీర్లను నియమించాం. దాతల సహాయంతో వసతులు కల్పించాం. ప్రస్తుతం స్కూల్​లో తరగతి గదులు సరిపోవడం లేదు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ చూపి, ఈ సమస్యను పరిష్కరించాలి.

– అర్చన, హెచ్​ఎం రెబ్బనపల్లి ప్రైమరీ స్కూల్