బీఈతో చేతులు కలిపిన రెక్‌‌‌‌‌‌‌‌బయో.. హెచ్పీవీ9 వ్యాక్సిన్ తయారీ కోసం

బీఈతో చేతులు కలిపిన రెక్‌‌‌‌‌‌‌‌బయో.. హెచ్పీవీ9 వ్యాక్సిన్ తయారీ కోసం

హైదరాబాద్, వెలుగు: బయోఫార్మా కంపెనీ బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ),   చైనాకు చెందిన రెక్‌‌‌‌‌‌‌‌బయో టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ (రెక్‌‌‌‌‌‌‌‌బయో) కలిసి హెచ్​పీవీ9 వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

ఈ భాగస్వామ్యం ద్వారా, రెక్‌‌‌‌‌‌‌‌బయో తమ అత్యాధునిక టెక్నాలజీని బీఈకి బదిలీ చేస్తుంది. ఫలితంగా భారతదేశంలో హెచ్​పీవీ9 వ్యాక్సిన్ కమర్షియల్ ఉత్పత్తి సాధ్యమవుతుంది.  హెచ్​పీవీ9 వ్యాక్సిన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్​పీవీ)  9 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 

ఈ వైరస్ గర్భాశయ క్యాన్సర్, యోని క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు,  నోటి క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లకు కారణమవుతుంది.