
అగ్గిపుల్లలతో క్రాకర్స్ వెలిగిస్తే.. ఒక్కోసారి ప్రమాదాలు జరిగి గాయాలు కావొచ్చు. అందుకే కాస్త దూరం నుంచే వెలిగించాలి. అందుకు ఈ ఎలక్ట్రిక్ గ్యాస్ లైటర్ బాగా ఉపయోగపడుతుంది. దీంతో గ్యాస్ స్టవ్, క్రాకర్లను ఈజీగా వెలిగించొచ్చు. ఈ ఫ్లేమ్‌లెస్ లైటర్ని స్ట్రా అండ్ వేవ్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. పవర్‌బ్యాంక్, మొబైల్ ఎడాప్టర్‌తో చార్జింగ్ పెట్టుకోవచ్చు.
ప్యాక్‌లో టైప్ సీ చార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 200 సార్లు వాడుకోవచ్చు. మన్నికైన స్టీల్ బాడీతో వస్తుంది. ఆన్ చేసిన ఏడు సెకన్లలో ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ప్లాస్మా ఆర్క్ టెక్నాలజీతో పనిచేస్తుంది. గాలి వచ్చినా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది.
ఎలక్ట్రిక్ క్యాండిల్స్
దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఇండ్లన్నీ దీపాల కాంతుల్లో వెలిగిపోతుంటాయి. చిన్న పిల్లలు ఉండే ఇండ్లలో మాత్రం దీపాలు, క్యాండిల్స్ వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయని తక్కువగా పెడుతుంటారు. కానీ.. ఈ క్యాండిల్స్ ఇంట్లో ఉంటే ఆ భయం అక్కర్లేదు. ఈ ఎలక్ట్రిక్ క్యాండిల్స్ చూడ్డానికి అచ్చం మైనపు క్యాండిల్స్‌లానే కనిపిస్తాయి.
వీటిని డెకెవో అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఫ్లేమ్‌లెస్ ఎల్‌ఈడీ టీ లైట్లు ఉంటాయి. క్యాండిల్‌లాగే మిణుకుమిణుకుమంటూ వెలుగుతాయి. మంట, పొగ ఉండదు. పైగా ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి. కాబట్టి పిల్లలు, పెట్స్‌కు ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఇండోర్, అవుట్‌డోర్ ఎక్కడైనా వాడుకోవచ్చు. విండ్‌ప్రూఫ్ డిజైన్‌తో రావడం వల్ల గాలులు వీచినా వెలుగుతూనే ఉంటాయి.
►ALSO READ | దీపావళి స్పెషల్..ఈ రుచికరమైన స్వీట్లను ఇంట్లోనే తయారుచేసుకోండి
వీటిలో వేసే ఒక్క ఎల్‌ఆర్1130 బ్యాటరీతో 100 గంటలకు పైగా పనిచేస్తాయి. వైరింగ్, చార్జింగ్ అవసరం లేదు. దీపావళితోపాటు పెండ్లిళ్లు, పుట్టినరోజులు, యానివర్సరీల టైంలో డెకరేషన్ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు.
నీటి దీపాలు
ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో దీపాలు పెడితే పొగవల్ల అక్కడంతా నల్లగా మారుతుంది. అలాంటప్పుడు ఈ వాటర్ సెన్సర్ ఎల్‌ఈడీ లైట్లను పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని చాలా కంపెనీలు మార్కెట్‌లో అమ్ముతున్నాయి. ఈ ఫ్లేమ్‌లెస్, స్మోక్‌లెస్ లైట్లు చూడ్డానికి అచ్చం నూనె దీపాల్లాగే ఉంటాయి. వీటిలో నూనెకు బదులు ఒక చెంచా నీళ్లు పోస్తే సరిపోతుంది.
నిజమైన నూనె దీపంలాగే ప్రకాశవంతంగా వెలుగుతాయి. ఇది వందశాతం సేఫ్. వీటిని హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఎల్‌ఆర్ 44 బటన్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఒక్క బ్యాటరీతో 50 గంటల కంటే ఎక్కువసేపు లైట్ వెలుగుతుంది.