రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నయ్. మునుపెన్నడులేని విధంగా రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మార్చి నెలలో పగటి పూట ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరో నాలుగు రోజులు ఎండల తీవ్రతతోపాటు.. వడగాల్పులు పెరుగుతాయని  వాతావరణశాఖ అలర్ట్ చేసింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మార్చిలోనే 43 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతుండటంతో ఇక ఏప్రిల్, మే నెలలో 44 నుంచి 46 డిగ్రీలకు చేరొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఆదిలాబాద్ చాప్రాలో నిన్న అత్యధికంగా  43.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ఆదిలాబాద్ అర్బన్ లో 43.2, కుమ్రంభీం జిల్లాలోనికెరమెరిలో 43.1, జగిత్యాలలోని మద్దుట్లలో 43, వనపర్తిలోని కేతేపల్లి, నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న నాలుగు రోజులు ఎండలు ఎక్కవగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడున్న టెంపరేటర్ కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, విదర్భ నుంచి కేరళ వరకు వీస్తున్న వేడిగాలులే దీనికి కారణమని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావొద్దని, ఒకవేళ వచ్చిన ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు. 

మరిన్ని వార్తల కోసం...

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. వలస బాటపట్టిన జనం

రెండేళ్లుగా కారులోనే నివాసముంటున్న మహిళ