దసరా కిక్కు.. ఒక్క రోజులోనే రూ. 279 కోట్ల లిక్కర్ సేల్స్

దసరా కిక్కు.. ఒక్క రోజులోనే  రూ. 279 కోట్ల లిక్కర్ సేల్స్
  • దసరానాడే గాంధీ జయంతి కావడంతో ముందే కొనుగోలు

హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. పండుగ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్ ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నాయి. దసరా రోజే(అక్టోబర్​ 2న) గాంధీ జయంతికావడంతో ముందు రోజు బుధవారమే స్టాక్​సేల్స్​పూర్తవుతాయని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్  భావిస్తున్నాయి. దీంతో డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం లిఫ్టింగ్​చేస్తున్నారు. సెప్టెంబర్​ 29న ఒక్క రోజులోనే  రూ. 278 కోట్ల 66 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 

మంగళవారం (సెప్టెంబర్ 30) కూడా రూ.300 కోట్లపైన మద్యం సేల్స్​ జరిగినట్లు ఎక్సైజ్​ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక గురువారం  కూడా రూ.300 కోట్ల పైన మద్యం లిప్ట్​ చేసే అవకాశం ఉన్నది. మూడో తేదీన కూడా సేల్స్​ ఉంటాయని, వరుసగా సెలవులు ఉండటం, స్థానిక ఎన్నికల నగారా మోగడంతో గ్రామాల్లో దవాత్ లు భారీగా చేసుకుంటారని ఎక్సైజ్​ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సెప్టెంబర్ లో 2, 715 కోట్ల ఆదాయం

సెప్టెంబర్​1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 26 లక్షల 71 వేల లిక్కర్ కేసులు,  33 లక్షల 24 వేల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటితో ప్రభుత్వానికి రూ.2, 715 కోట్ల ఆదాయం వచ్చింది. మంగళవారం జరిగిన సేల్స్​ కలిపితే 3 వేల కోట్ల రూపాయాలు దాటనుంది. గాంధీ జయంతి నేపథ్యంలో మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. కానీ పల్లెల్లో విక్రయాలు ఆపడం కష్టమని అధికారులు చెప్తున్నారు.